News January 22, 2025

ప్రతి విద్యార్థికి అపార్ ఐడీ తప్పనిసరి:  భూపాలపల్లి డీఈవో

image

దేశ పౌరులకు ఆధార్ కార్డు ఏ విధంగా ఉంటుందో ప్రతి విద్యార్థికి అపార్(ఆటోమోటెడ్ పర్మనెంట్ అకాడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) ఐడీ కూడా తప్పనిసరిగా ఉండాలని భూపాలపల్లి జిల్లా విద్యాధికారి రాజేందర్ అన్నారు. ఈ మేరకు ఆయన కాటారం మండలంలోని తెలంగాణ గిరిజన, గురుకుల పాఠశాలలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులకు ఏర్పాటుచేసిన అపార్ వర్క్ షాప్‌ను బుధవారం పరిశీలించారు. పలువురు జిల్లా, మండలాధికారులు పాల్గొన్నారు.

Similar News

News February 13, 2025

కాలువలో మృతదేహం.. నంద్యాల వాసిగా గుర్తింపు!

image

బనగానపల్లె మండలం ఐ.కొత్తపేట గ్రామ సమీపంలోని ఎస్ఆర్బీసీ కాలువలో మృతదేహం లభ్యమైంది. మృతుడు నంద్యాల పట్టణ వాసిగా గుర్తించినట్లు బనగానపల్లె పోలీసులు వెల్లడించారు. ఆధారాలను బట్టి నంద్యాలలో ఫ్రూట్ జ్యూస్ వ్యాపారం నిర్వహిస్తూ జీవనం సాగించే షేక్ జాకీర్ బాషా(43)గా గుర్తించామని తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

News February 13, 2025

బాపట్ల: అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య

image

సంతమాగులూరు మండలంలోని కొమ్మాలపాడు ఎన్ఎస్పీ కాలువ వద్ద అప్పుల బాధతో విత్తనాల వ్యాపారి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. మృతుడు పసుమర్తిపాలెంకు చెందిన సుబ్బారెడ్డిగా సంతమాగులూరు పోలీసులు గుర్తించారు. మృతుడి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

News February 13, 2025

పాలమూరుకు నిధులు ఇవ్వండి: BJP ఎంపీ

image

కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌తో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ బుధవారం భేటీ అయ్యారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అలంపూర్‌ 5వ శక్తి పీఠం జోగులాంబ టెంపుల్‌తో పాటు కురుమూర్తి, మన్యంకొండ, మల్దకల్ తిమ్మప్ప దేవాలయాల అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు ఇవ్వాలని వినతిపత్రం అందజేశారు. ప్రతిపాదనలపై గజేంద్రసింగ్ షెకావత్ సానుకూలంగా స్పందించారని ఎంపీ పేర్కొన్నారు.

error: Content is protected !!