News May 20, 2024
ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్: కలెక్టర్

ప్రతి 500 పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు ఒక టేబుల్ ఏర్పాటు చేయడం ద్వారా ఓట్ల లెక్కింపు వేగవంతం అవుతుందని కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు. జూన్ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపులో భాగంగా, తొలుత నిర్వహించే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై సోమవారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో డెమో నిర్వహించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను ఏ విధంగా లెక్కించాలనే అంశంపై ప్రాక్టికల్గా అవగాహన కల్పించారు.
Similar News
News November 12, 2025
రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లాకు రెండో స్థానం

అనంతపురంలో ఈ నెల 7 నుంచి 9 వరకు జరిగిన 7వ రాష్ట్రస్థాయి రెవెన్యూ క్రీడా పోటీల్లో కృష్ణా జిల్లా బృందం అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రెండవ స్థానాన్ని దక్కించుకుంది. సిబ్బంది వివిధ విభాగాల్లో పతకాలను కైవసం చేసుకున్నారు. రెవెన్యూ సిబ్బంది కృషి, నిబద్ధత ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ డీ.కే. బాలాజీ వారిని అభినందించారు.
News November 11, 2025
మచిలీపట్నం: టిడ్కో ఇళ్లను ఇవ్వాలని వినతి

టిడ్కో ఇళ్ల ఫ్లాట్లను లబ్దిదారులకు అందించాలని ఐద్వా మచిలీపట్నం నగర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ లో జరిగిన మీకోసం కార్యక్రమంలో డీఆర్ఓ చంద్రశేఖరరావును కలిసి వినతిపత్రం అందజేశారు. 2017వ సంవత్సరంలో పేదల గృహాల కొరకు అప్పటి టీడీపీ ప్రభుత్వం మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పేద ప్రజల వద్ద రూ.500ల నుంచి రూ.12,500, రూ.25,000లు వసూళ్లు చేసి గృహాలు నిర్మించారన్నారు.
News November 10, 2025
MTM: నేడు కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక

జిల్లా ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్లో “మీకోసం” ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఉదయం 10:30 గంటలకు కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండల కేంద్రాలలో కూడా PGRS జరుగుతుందని ఆయన వెల్లడించారు.


