News March 31, 2025
ప్రత్తిపాడుకి చెందిన అన్నదమ్ములను కాపాడిన పోలీసులు

ఎస్.రాయవరం సముద్ర తీరంలో ఆదివారం స్నానానికి దిగిన అన్నదమ్ములు బాలు, గోపి మునిగిపోతుండగా మెరైన్ పోలీసులు కాపాడారు. కాకినాడ జిల్లా పత్తిపాడుకు చెందిన వీరు నక్కపల్లి మండలం సారిపల్లిపాలెంలో బంధువుల ఇంటికి వచ్చారు. రేవు పోలవరం వెళ్లి సముద్రంలో స్నానం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. వీరిని ఏఎస్ఐ కృష్ణ, కానిస్టేబుల్ చిన్నబాబు, హోంగార్డు అప్పలకొండ కాపాడి ఒడ్డుకు చేర్చారు.
Similar News
News November 13, 2025
మా బాబును టీచర్లు చితకబాదారు: పేరెంట్స్

భద్రాచలం కూనవరం రోడ్లో ఉన్న ఓ ప్రైవేటు స్కూల్లో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని టీచర్లు చితకబాదారని తల్లిదండ్రులు స్కూల్ ఎదుట ఆందోళనకు దిగారు. చిన్నపిల్లాడిని ఈ విధంగా ఎందుకు కొట్టారని అడిగేందుకు వచ్చిన తమను యాజమాన్యం కలవకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న పలు విద్యార్థి సంఘాలు స్కూల్ వద్దకు చేరుకొని ధర్నాకు చేపట్టాయి.
News November 13, 2025
నానబెట్టిన మెంతులు మంచివేనా?

మెంతుల్లో ఎ, బి,సి, కె విటమిన్లతో పాటు ఫైబర్, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. ముఖ్యంగా మెంతులను నానబెట్టుకుని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఇవి షుగర్, బరువును తగ్గించడంతో పాటు జీర్ణక్రియకు మేలు చేస్తాయి. అయితే డయాబెటిస్ ఉన్నవారు, బీపీ మందులు వాడేవారు, గర్భిణులు వైద్య నిపుణులను సంప్రదించిన తర్వాతే సరైన మోతాదులో తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.
News November 13, 2025
టుడే..

* ఢిల్లీలో ఇండో-యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశం
* AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత యూపీఎస్సీ కోచింగ్.. నేటి నుంచి 16వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ
* విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
* రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ క్యాంపస్కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్


