News January 4, 2025
ప్రత్తిపాడులో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి స్పాట్డెడ్
ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని శుక్రవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సంతోషి మాతా దేవాలయం వద్ద హైవేపై గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో బైక్పై వెళ్తున్న వాహనదారుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న ప్రత్తిపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News January 8, 2025
ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి సారించాలి: కలెక్టర్
ఫ్రీ ఓల్డ్ భూములు డేటా ఎంట్రీ, రెవెన్యూ సదస్సులలో అందిన భూసంబంధిత ఫిర్యాదులు పరిష్కారం, రీసర్వే అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ మహేష్ కుమార్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం రాష్ట్ర భూపరిపాలన ముఖ్య కమిషనర్ జయలక్ష్మి అమరావతి నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్, జేసీ నిశాంతి పాల్గొన్నారు.
News January 8, 2025
తూ.గో: కోడి పందేల నిర్వహణపై హైకోర్టు కీలక ఆదేశాలు
ఉభయగోదావరి జిల్లాల్లో కోడి పందేల నిర్వహణపై మంగళవారం హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పందేలు జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశిస్తూ న్యాయమూర్తి లక్ష్మీనరసింహ చక్రవర్తి ఉత్తర్వులు ఇచ్చారు. దీంతో సంక్రాంతికి నిర్వహించే కోడిపందేలపై ఉత్కంఠ నెలకొంది. సంప్రదాయబద్ధంగా వస్తున్న పందేలను పూర్తిగా ఆపేయకుండా, కత్తులు కట్టకుండా నిర్వహిస్తే మంచిదని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీనిపై మీ కామెంట్
News January 8, 2025
పిఠాపురం: అక్కాచెల్లెళ్లను మోసగించిన వ్యక్తికి 30 ఏళ్లు జైలు శిక్ష
పిఠాపురానికి చెందిన అక్కాచెల్లెళ్లను అదే గ్రామానికి చెందిన హేమంత్ ప్రేమ పేరుతో మోసం చేయడంతో అతడికి 30ఏళ్ల జైలు శిక్ష, రూ.10వేల జరిమానా విధించింది. ఈ మేరకు కాకినాడ పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి శ్రీదేవి మంగళవారం తీర్పు చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఒకరికి తెలియకుండా మరొకరిపై రెండేళ్లపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికల తండ్రి ఫిర్యాదుతో 2019లో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.