News January 31, 2025
ప్రత్తిపాడు: ఆవు దూడల పుట్టినరోజు.. ఊరంతా భోజనాలు

ప్రత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో గురువారం ఉదయం రామలక్ష్మణుల పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇంతకీ ఈ రామలక్ష్మణులు ఎవరనుకుంటున్నారా? మిరియాల వెంకటేష్ అనే రైతుకి చెందిన ఆవు గతేడాది ఒకే కాన్పులో కవలగిత్తలకు జన్మనిచ్చింది. వాటికి రామలక్ష్మణులుగా నామకరణం చేసి అపురూపంగా చూసుకుంటున్నారు. ఇవాళ వాటి బర్త్ డే సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఊరంతా భోజనాలు ఏర్పాటు చేశారు.
Similar News
News November 13, 2025
కడప: ల్యాబ్లో సీతాకోకచిలుకల ఉత్పత్తి

కడప జిల్లాలోని వైవీయూ సరికొత్త ప్రయోగం చేపట్టింది. జంతుశాస్త్ర శాఖ ప్రయోగశాలలో క్యాపిటేటివ్ బ్రీడింగ్ ద్వారా సీతాకోక చిలుకలను ఉత్పత్తి చేసింది. వీటిని వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ గురువారం విడుదల చేశారు. ల్యాబ్ ద్వారా సీతాకోక చిలుకలను సృష్టించడం గొప్ప విషయమని కొనియాడారు. జువాలజి HOD డా.ఎస్పీ వెంకటరమణను పలువురు అభినందించారు. రిజిస్టర్ ప్రొ.పద్మ, డీన్ ప్రొ. ఏజీ దాము పాల్గొన్నారు.
News November 13, 2025
BHPL: రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు రైతుల పక్షాన ఉండాలి: గండ్ర

రైస్ మిల్లర్లు, ట్రాన్స్ పోర్టర్లు రైతుల పక్షాన ఉండాలని, వ్యాపార దృష్టితో కాకుండా రైతుల పక్షాన ఉండాలని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఆయన ధాన్యం కొనుగోలు ప్రక్రియపై సూచనలు చేశారు. కొనుగోలు చేసిన ధాన్యానికి 48 గంటల్లో చెల్లింపు చేసేందుకు ట్యాబ్ ఎంట్రీలు సత్వరం పూర్తి చేయాలని అన్నారు. వరి కోత యంత్రాలు 18 నుంచి 26 ఆర్పీఎంతో వరి కోయడం వల్ల తాలు తక్కువ వచ్చే అవకాశం ఉందని సూచనలు చేశారు.
News November 13, 2025
ఈనెల 15న రాజమహేంద్రవరంలో జాబ్ మేళా

ఈ నెల 15న రాజమహేంద్రవరం మోడల్ కెరీర్ సెంటర్లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి హరిచంద్ర ప్రసాద్ గురువారం తెలిపారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభమవుతుందన్నారు. 10వ తరగతి ఆపై చదివి, 19-40 ఏళ్ల లోపు వయసున్న వారు అర్హులన్నారు.


