News January 31, 2025
ప్రత్తిపాడు: ఆవు దూడల పుట్టినరోజు.. ఊరంతా భోజనాలు

ప్రత్తిపాడు మండలం చిన్నశంకర్లపూడి గ్రామంలో గురువారం ఉదయం రామలక్ష్మణుల పుట్టినరోజు వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఇంతకీ ఈ రామలక్ష్మణులు ఎవరనుకుంటున్నారా? మిరియాల వెంకటేష్ అనే రైతుకి చెందిన ఆవు గతేడాది ఒకే కాన్పులో కవలగిత్తలకు జన్మనిచ్చింది. వాటికి రామలక్ష్మణులుగా నామకరణం చేసి అపురూపంగా చూసుకుంటున్నారు. ఇవాళ వాటి బర్త్ డే సందర్భంగా భారీ కేక్ కట్ చేసి ఊరంతా భోజనాలు ఏర్పాటు చేశారు.
Similar News
News July 6, 2025
KMR: ‘రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలి’

సబ్ ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల ప్రాంతాల్లోనే ఉపయోగించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు ఆదేశించారు. కామారెడ్డిలో శనివారం జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో వారికి రిజర్వేషన్ ప్రకారం వాటా కల్పించాలని ఆయన స్పష్టం చేశారు. భూ భారతి చట్టం ద్వారా ఎస్సీ, ఎస్టీల భూ సమస్యలను పరిష్కరించాలన్నారు.
News July 6, 2025
ప్రభుత్వ పాఠశాలల్లో అభివృద్ధి పనులపై కలెక్టర్ సమీక్ష

ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులపై విద్యా శాఖ, ఇంజినీరింగ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేజీబీవీ, ప్రభుత్వ పాఠశాలల్లో మొదటి, రెండో దశలో చేపట్టిన అభివృద్ధి పనులు, వాటి పురోగతి గురించిన వివరాలను డీఈవో వాసంతి, ఇంజినీరింగ్ అధికారులు కలెక్టర్ స్నేహ శబరీష్‌కు వివరించారు.
News July 6, 2025
విజయవాడ: స్కిల్ హబ్‌లో పనులకు టెండర్‌లు

తుళ్లూరులోని అమరావతి స్కిల్ హబ్‌లో కాంక్రీట్ బ్లాక్‌ల పనులు పూర్తి చేసేందుకు CRDA శనివారం టెండర్‌లు ఆహ్వానించింది. రూ.8 లక్షల అంచనా వ్యయంతో చేపట్టే ఈ పనుల నిమిత్తం గుత్తేదారుల నుంచి టెండర్‌లు ఆహ్వానిస్తున్నామని విజయవాడలోని CRDA కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. ఈనెల 14లోపు ఏపీ ఈ- ప్రాక్యూర్‌మెంట్ పోర్టల్ ద్వారా బిడ్‌లను సమర్పించవచ్చని సూచించింది.