News February 28, 2025

ప్రత్తిపాడు: గుర్తుతెలియని వాహనం ఢీకొని వృద్ధుడి మృతి

image

ప్రత్తిపాడు జాతీయ రహదారిపై గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో వృద్ధుడు మృతి చెందాడు. మండలంలోని ధర్మవరం గ్రామానికి చెందిన నూకరాజు (75) ఆ గ్రామ జెడ్పీ హైస్కూల్ రోడ్డు సమీపంలో జాతీయ రహదారిని దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ఘటనలో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News February 28, 2025

వరంగల్: తెలంగాణ పిండివంటలను నేర్చుకున్న కేరళ యువత

image

కేరళ రాష్ట్రానికి చెందిన 27 మంది యువతీ యువకులు రంగశాయిపేటలోని హోమ్ ఫుడ్స్ సందర్శించారు. ఈనెల 20వ తేదీ నుండి మార్చ్ 3 వరకు ఐదు రోజుల పాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం జరుగుతుందన్నారు. తెలంగాణ పిండివంటలైన సకినాలు, మురుకులు, గరిజలు, సర్వపిండి మొదలు వంటలను నిర్వాహకులు కేరళ నుంచి వచ్చిన యువతకు నేర్పారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు గురించి వారికి తెలియజేశారు.

News February 28, 2025

నంద్యాల జిల్లా టాప్ న్యూస్

image

☞ అతిసారాపై ప్రజలు ఆందోళన చెందొద్దు: నంద్యాల కలెక్టర్ ☞ ఆత్మకూరు ఘటనపై విచారణకు ఆదేశం: మంత్రి బీసీ☞ బడ్జెట్‌లో కలర్ ఎక్కువ.. కంటెంట్ తక్కువ: బుగ్గన☞ ఇద్దరి మృతిపై ఎంపీ శబరి విచారం ☞ పోసాని అరెస్టును ఖండించిన కాటసాని☞ నీటి తొట్టిలో పడి బాలుడి మృతి☞ బడ్జెట్ అంకెల గారడీ: నరసింహ యాదవ్ ☞ యాగంటి రథోత్సవం ప్రారంభించిన మంత్రి బీసీ సతీమణి 

News February 28, 2025

వరంగల్: దశాబ్ద కాలం కోరిక నెరవేరింది: మంత్రి సురేఖ

image

వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జిల్లా వాసులకు దశాబ్ద కాలం కోరిక నెరవేరిందని మంత్రి కొండా సురేఖ అభిప్రాయపడ్డారు. ఇది సీఎం రేవంత్, ఉన్నతాధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వరంగల్ జిల్లా ప్రజల అదృష్టమని పేర్కొన్నారు. ఓరుగల్లు వాసులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న కలను నెరవేర్చే దిశగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేగంగా అడుగులు వేసిందన్నారు.

error: Content is protected !!