News March 9, 2025
ప్రత్తిపాడు: జనసేన ఇన్ఛార్జ్ తమ్మయ్యబాబు సస్పెండ్

ప్రత్తిపాడు జనసేన ఇన్ఛార్జ్ వరుపుల తమ్మయ్యబాబు స్థానిక సీహెచ్సీ వైద్యురాలిపై విరుచుకుపడ్డ విషయం విధితమే. ఒక పక్క పార్టీ కార్యాలయం విచారణకు ఆదేశించింది. ఆదివారం రాత్రి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ వేములపాటి అజయ్ తమ్మయ్య బాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది సంచలనంగా మారింది. తప్పు చేసిన వారిని పవన్ వదలరు అనడానికి ఇది నిదర్శనంగా నిలిచింది.
Similar News
News December 5, 2025
విద్యార్థుల సమగ్ర అభివృద్ధి లక్ష్యం: కలెక్టర్

తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల అనుసంధానాన్ని బలోపేతం చేసి విద్యార్థుల సమగ్ర అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన మెగా పీటీఎం-3.0 విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. శుక్రవారం అమలాపురం మండలం పితాని వారి పాలెం ప్రాథమిక పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డుల ద్వారా విద్యార్థుల నైపుణ్యాలను పరిశీలించారు.
News December 5, 2025
కడపలో ఆచూకీ లేని 51వేల రేషన్ కార్డుదారులు..!

కడప జిల్లాలో 51,961 మంది రేషన్ కార్డుదారుల ఆచూకీ లేదు. దీంతో వారికి పంపిణీ చేయాల్సిన కార్డులు మిగిలిపోయాయి. జిల్లాకు 5,73,675 స్మార్ట్ కార్డులు రాగా వీటిలో 5,21,714 కార్డులు మాత్రమే పంపిణీ చేశారు. కడపలో 15,732, బద్వేల్లో 12,223, జమ్మలమడుగులో 18,906, పులివెందుల డివిజన్లో 5,100 కార్డులు మిగిలిపోయాయి. కార్డుల్లో ఉన్న అడ్రస్సుల్లో లబ్ధిదారులు లేకపోవడంతో వాటిని అధికారులు పంపిణీ చేయలేదు.
News December 5, 2025
నల్గొండ: ప్రతి విద్యార్థికి ఉపకార వేతనం అందాలి: కలెక్టర్

నల్గొండ జిల్లాలోని ప్రతి పేద విద్యార్థి ఉపకార వేతనం (స్కాలర్షిప్) పొందేలా అధికారులు మానవతా దృక్పథంతో పని చేయాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. కలెక్టరేట్లో ఎంఈఓలు, సంక్షేమ శాఖల అధికారులతో ఆమె పాఠశాల విద్యార్థుల స్కాలర్షిప్ మంజూరుపై సమీక్ష నిర్వహించారు. దరఖాస్తుల పరిశీలన వేగవంతం చేయాలని, ఏ ఒక్క పేద విద్యార్థి కూడా స్కాలర్షిప్ కోల్పోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.


