News November 11, 2024
ప్రత్తిపాడు: జూద శిబిరంపై పోలీసుల దాడి
ప్రత్తిపాడులోని ఓ పేకాట శిబిరంపై పోలీసులు ఆదివారం దాడి చేశారు. CI శ్రీనివాసరావు వివరాల మేరకు.. రాబడిన సమాచారం మేరకు పేకాట స్థావరాలపై దాడి చేసి 38మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం వారి వద్ద నుంచి రూ.96,300 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.
Similar News
News December 2, 2024
పల్నాటి వీరుల చరిత్రను ఎప్పుడు ముద్రించారో తెలుసా?
పల్నాటి వీరుల చరిత్రను తొలిసారి శ్రీనాథుడు 300 సంవత్సరాల తర్వాత మంజరీ ద్విపద కావ్యముగా రచించగా, ఇది ఆయన చివరి రచన. శ్రీనాథుని తర్వాత కొండయ్య, మల్లయ్య (16వ శతాబ్దం) అను కవులు రచించారు. ఆ తర్వాత 1862 ప్రాంతంలో ముదిగొండ వీరభద్రకవి ఈ కథను వీర భాగవతం పేరుతో మనోహరమైన పద్యకావ్యంగా రచించారు. అక్కిరాజు ఉమాకాంతం మొట్టమొదట పల్నాటి వీరచరిత్ర యొక్క ప్రతులు సంపాదించి, సంస్కరించి 1911లో అచ్చువేయించారని సమాచారం.
News December 1, 2024
ధాన్యం కొనుగోలుపై అపోహలు వద్దు: నాదెండ్ల
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్దతు వరకు ధాన్యాన్ని రైతుల వద్ద నుంచి కొనుగోలు చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. తెనాలి పట్టణ పరిధిలోని ఐతానగర్‌లో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు దళారులను నమ్మి ధాన్యం విక్రయించవద్దని, ప్రభుత్వానికి ధాన్యం విక్రయించాలని సూచించారు. ధాన్యం కొనుగోలు మీద ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని భరోసా కల్పించారు.
News December 1, 2024
రేపు మంగళగిరిలో ప్రజా వేదిక నిర్వహణ
మంగళగిరి ఎన్టీఆర్ భవన్లో సోమవారం ప్రజా వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కార్యాలయ నిర్వాహకులు ఆదివారం తెలిపారు. రేపు జరిగే ప్రజా వేదికలో గుంటూరు ఎమ్మెల్యే నజీర్ అహ్మద్, APTDC ఛైర్మన్ నూకసాని బాలాజీ, ఏపీ ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ బోర్డు ఛైర్మన్ కేకే చౌదరి పాల్గొంటారని చెప్పారు. ఈ ప్రజా వేదికలో వారు ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారన్నారు. అందరూ ఈ ప్రజా వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.