News January 19, 2025

ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

image

ప్రత్తిపాడు మండలం ధర్మవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఏలేశ్వరం మండలం పేరవరం గ్రామానికి చెందిన రాజామని శివ (22)పేరవరం నుంచి తుని పంక్షన్‌కు వెళుతుండగా లారీ ఢీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రత్తిపాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటన పలువురిని కంటతడి పెట్టించింది.

Similar News

News December 8, 2025

నిడదవోలు మున్సిపాలిటీలో తారుమారైన పార్టీ బలాలు

image

నిడదవోలు మున్సిపాలిటీలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోయాయి. గత ఎన్నికల్లో 28 స్థానాలకు గాను 27 గెలుచుకున్న వైసీపీ బలం ప్రస్తుతం 12కు పడిపోయింది. ఒక్క కౌన్సిలర్ లేని జనసేన ఏకంగా 15 మంది సభ్యులతో పాటు ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పీఠాలను దక్కించుకుంది. ఇక్కడి జనసేన ఎమ్మెల్యే మంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఆ పార్టీకి కలిసొచ్చింది. ఇదే సమయంలో టీడీపీ ఇక్కడ ఉనికి కోల్పోవడంతో రాజకీయంగా చర్చనీయాంశమైంది.

News December 8, 2025

రాజమండ్రి: నేడు PGRS కార్యక్రమం

image

డిసెంబర్ 8న (సోమవారం) జిల్లా వ్యాప్తంగా కలెక్టరేట్ నుంచి సచివాలయాల వరకు PGRS కార్యక్రమం యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వాటిని తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పౌర సేవల కోసం వాట్సాప్ నంబర్ 95523 00009 అందుబాటులో ఉందని తెలిపారు. ఫిర్యాదుదారులు దీనిని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.