News February 9, 2025
ప్రత్తిపాడు: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ప్రత్తిపాడులో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తాడేపల్లిగూడెం(M) కొండ్రుపోలుకు చెందిన లక్ష్మి మృతిచెందింది. భర్త సత్యనారాయణతో దువ్వలో బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా ప్రత్తిపాడు హైవేపై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె తలకు గాయమై చనిపోయింది. భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు SI స్వామి తెలిపారు.
Similar News
News December 24, 2025
మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. కేజీ వెండి ధర ఇవాళ రూ.10,000 పెరిగి రూ.2,44,000కు చేరింది. గత 5 రోజుల్లోనే రూ.23వేలు పెరగడం గమనార్హం. అటు 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.380 పెరిగి రూ.1,38,930కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.350 ఎగబాకి రూ.1,27,350 పలుకుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News December 24, 2025
మరో గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి HMDA సిద్ధం

మరో గ్రీన్ ఫీల్డ్ రహదారిని నిర్మించేందుకు HMDA సిద్ధమవుతోంది ORR నుంచి ప్రాంతీయ రోడ్లకు అనుసంధానం చేసేలా వీటిని రూపొందిస్తున్నారు. బుద్వేల్ నుంచి 165 రహదారి వద్ద కోస్గి వరకు ఈ రహదారి నిర్మించనున్నారు. దీనికి సంబంధించి డీపీఆర్ రూపొందించే పనిలోపడ్డారు. డీపీఆర్ పూర్తయిన అనంతరం ప్రభుత్వానికి ఈ నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు. 81 కి.మీ పొడవుతో, 4 లైన్లుగా రహదారి నిర్మాణం చేపట్టనున్నారు.
News December 24, 2025
నేడు వామనావతారంలో భద్రాద్రి రామయ్య

భద్రాచలం ముక్కోటి ఉత్సవాల్లో భాగంగా ఐదో రోజు శ్రీరామచంద్రుడు వామనావతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. బలి చక్రవర్తి అహంకారాన్ని అణచి, మూడు అడుగులతో విశ్వాన్ని కొలిచిన స్వామివారి వైభవాన్ని చూసి భక్తజనం పరవశించనుంది. కాగా ఆలయంలో నిర్వహిస్తున్న ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్ఛారణల మధ్య రామయ్యను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. ఆధ్యాత్మిక శోభతో భద్రాద్రి క్షేత్రం రామనామస్మరణతో మారుమోగుతోంది.


