News March 24, 2024

ప్రత్యర్థులుగా రిటైర్డ్ ఉన్నత ఉద్యోగులు!

image

అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం ‘కూటమి’ టికెట్‌పై సందిగ్ధత తొలగింది. ముందు TDP నుంచి రాజేశ్‌కు టికెట్ దక్కగా.. అసమ్మతి నేపథ్యంలో ఆ టికెట్ జనసేన ఖాతాలోకి వెళ్లింది. ఇక్కడి నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేయనున్నారు. వైసీపీ నుంచి విప్పర్తి వేణుగోపాల్ బరిలో ఉన్నారు. విప్పర్తి ఇరిగేషన్ శాఖలో.. గిడ్డి పోలీస్ శాఖలో ఉన్నత ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యారు. వీరిద్దరూ తొలిసారి అసెంబ్లీ బరిలో నిలుస్తున్నారు.

Similar News

News March 16, 2025

రాజమండ్రి: జన్మభూమి ఎక్స్‌ప్రెస్ దారి మళ్లింపు

image

విశాఖపట్నం -లింగంపల్లి, లింగంపల్లి- విశాఖపట్నం మధ్య రోజు నడిచే రైళ్లు శాశ్వత ప్రాతిపదికన దారి మళ్లించడం జరిగిందని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు. జన్మభూమి ఎక్సె‌ప్రెస్ గోదావరి జిల్లాల ప్రజలకు ముఖ్య రవాణాగా ఉంది. నేటి నుంచి చర్లపల్లి – అమ్ము గూడ – సనత్ నగర్ మీదుగా దారి మళ్లించామని పేర్కొన్నారు. ఏప్రిల్ 25వ తారీకు వరకు సికింద్రాబాద్ వెళ్లదని రైల్వే అధికారులు తెలిపారు.

News March 16, 2025

గోపాలపురం: పాడె మోసిన MLA

image

ద్వారకాతిరుమల మండలంలోని వెంకటకృష్ణపురంలో టీడీపీ కార్యకర్త తాడేపల్లి రమేష్ ఆదివారం చనిపోయారు. రమేష్ మృతదేహానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు నివాళులర్పించారు. కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అనంతరం అతని పాడేను ఎమ్మెల్యే మోశారు. బిడ్డలకు అండగా ఉంటామని హామీ ఇచ్చి, రూ.50 వేలు ఆర్థిక సహాయాన్ని అందించారు.

News March 16, 2025

రాజమండ్రి: క్యారమ్స్ ఆడిన కలెక్టర్, ఎస్పీ

image

నగరపాలక సంస్థ కార్యాలయ ఆవరణలో ఏర్పాటుచేసిన క్యారం బోర్డు వద్దకు కలెక్టర్ పి.ప్రశాంతి, ఎస్పీ డి.నరసింహ కిషోర్, కమిషనర్ కేతన్ గార్గ్‌లు వెళ్లి ఆటవిడుపుగా కొద్దిసేపు క్యారమ్స్ ఆడారు. కార్పొరేషన్ కార్యాలయంలో శనివారం సమీక్షా సమావేశం జరిగింది. బిజీ బిజీగా ఉండే కలెక్టర్, ఎస్పీ, కమిషనర్‌లు తిరుగు పయనంలో క్యారమ్స్ ఆడి వినోదం పొందారు. ఆ దృశ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

error: Content is protected !!