News November 1, 2024

ప్రత్యామ్నాయ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయాలని జీవన్ రెడ్డి లేఖ

image

బీర్పూర్ మండలం రేకులపల్లి గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్‌కు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో ప్రత్యామ్నాయ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయాలని కోరుతూ MLC జీవన్ రెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో సాగు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, రైతులు ఈ విషయాన్ని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకువెళ్లగా.. కలెక్టర్, ఇరిగేషన్ అధికారులకు లేఖ రాసి సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని లేఖలో పేర్కొన్నారు.

Similar News

News November 24, 2024

వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలి: ఉప ముఖ్యమంత్రి భట్టి

image

డోర్ లాక్, వలస వెళ్లిన వారి వివరాలు ఫోన్ ద్వారా సేకరించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆదివారం కలెక్టర్‌తో మాట్లాడారు. సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరికి దశకు చేరుకుందని, సర్వే డాటా ఎంట్రీ చాలా కీలకమైనదని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని ఆయన స్పష్టం చేశారు.

News November 24, 2024

మంథని: కోటి దీపోత్సవంలో శ్రీధర్ బాబు

image

హైదరాబాదులోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన కోటి దీపోత్సవ కార్యక్రమంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. కోటి దీపోత్సవంలో పాల్గొనడం దివ్యానుభూతి ఇచ్చిందన్నారు. కార్తీకమాస పూజల్లో భాగంగా సీతారాముల కళ్యాణంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇంత పెద్ద ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని అపూర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ నిర్వాహకులను అభినందించారు.

News November 24, 2024

జగిత్యాల: మత్స్యకారుడి వలకు చిక్కిన అరుదైన చేప

image

జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువులో చేపల వేటకు వెళ్లిన గంగ పుత్రులకు ఓ అరుదైన చేప చిక్కింది. సక్కరమౌత్ క్యాట్ ఫిష్ అనే అరుదైన చేప తులసినగర్‌కి చెందిన గంగపుత్రుడు నవీన్ వలకు చిక్కింది. ఈ చేపను మార్కెట్లోకి అమ్మకానికి తీసుకు రావడంతో అంతా ఆసక్తిగా తిలకించారు. ఇవి ఎక్కువగా ఉష్ణ మండలంలోని మంచినీటిలో ఉంటాయని నవీన్ తెలిపారు.