News September 18, 2024
ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
కడప జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ యోజన, సాలిడ్ వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, స్వచ్ఛతా హీ సేవ, హౌసింగ్, నూతన ఇసుక పాలసీ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు
Similar News
News October 4, 2024
వైఎస్‌ఆర్ జిల్లా పేరు మార్చాలన్న మంత్రి.. దీనిపై మీ కామెంట్
వైఎస్సార్ జిల్లా పేరును మార్చాలని మంత్రి సత్యకుమార్ యాదవ్ CM చంద్రబాబుకు లేఖ రాసిన విషయం తెలిసిందే. YCP ప్రభుత్వం అవగాహనా రాహిత్యంతో వైఎస్‌ఆర్ కడప జిల్లాను వైఎస్‌ఆర్ జిల్లాగా మార్చిందని మంత్రి పేర్కొన్నారు. కడప జిల్లా చారిత్రక నేపథ్యం, వైఎస్ఆర్ చేసిన అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని వైఎస్సార్ జిల్లా పేరును వైఎస్సార్ కడప జిల్లాగా మార్చాలని మంత్రి సీఎంకు విజ్ఞప్తి చేశారు. దీనిపై మీ కామెంట్..
News October 4, 2024
కడప: YCPకి మాజీ మంత్రి కుమారుడి రాజీనామా
జమ్మలమడుగు నియోజకవర్గం ఎర్రగుంట్ల మున్సిపల్ ఛైర్మన్ మూలే హర్షవర్ధన్ రెడ్డి శుక్రవారం ఉదయం వైసీపీకి రాజీనామా చేశారు. ఇతను మాజీ హోమ్ మినిస్టర్ మైసూరారెడ్డి కుమారుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్ రెడ్డికి స్వయానా పెదనాన్న కుమారుడు. ఈయన గడిచిన ఎన్నికల్లో కూడా వైసీపీ పక్షాన క్రియాశీలకంగా వ్యవహరించారు. హర్షవర్ధన్ రెడ్డి గత కొంతకాలంగా వైసీపీకి దూరంగా ఉంటున్నారు.
News October 4, 2024
కడప: అధికారుల పేరుతో నగదు వసూలు.. తస్మాత్ జాగ్రత్త
కడప జిల్లాలో ఉన్నతాధికారుల పేరుతో సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు వసూళ్లకు పాల్పడుతున్నాడని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ శివ శంకర్ సూచించారు. ఉన్నతాధికారులు, జిల్లా అధికారుల పేరు, ఫోటో పెట్టి వాట్సాప్ ఖాతాను సైబర్ నేరగాళ్లు సృష్టించి అత్యవసరంగా డబ్బు పంపాలని మెసేజ్‌లు పంపిస్తున్నారన్నారు.
ఉన్నతాధికారులు, జిల్లా అధికారులు ఎవరూ డబ్బు కానీ పంపాలని ఎప్పుడు అడగరనేది తెలిపారు.