News January 26, 2025

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు..

Similar News

News December 4, 2025

వరంగల్ జిల్లా తొలి విడత ఎన్నికల్లో 11 స్థానాలు ఏకగ్రీవం

image

మొదటి విడత స్థానిక ఎన్నికల్లో WGL జిల్లాలో 11 గ్రామాల్లో సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. రాయపర్తి మండలంలో 6, పర్వతగిరిలో 3, వర్ధన్నపేటలో 2 చోట్ల ఏకగ్రీవాలు నమోదయ్యాయి. పోతురెడ్డిపల్లి, కిష్టపురం సూర్యతండా, బాలునాయక్ తండాల్లో కాంగ్రెస్ నుండి సర్పంచ్‌లుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పర్వతగిరిలో మోత్యతండా, సూపతండా, శ్రీనగర్‌లో కూడా ఏకగ్రీవం కాగా వర్ధన్నపేటలో రామోజీ కుమ్మరిగూడెం, చంద్రుతండా అయ్యాయి.

News December 4, 2025

వరంగల్: ఇక ‘గుర్తుల’ ప్రచారం..!

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో మొదటి విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి అభ్యర్థులకు ఎన్నికల అధికారులు గుర్తులు కేటాయించారు. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు అభ్యర్థులు గుర్తులు లేకుండానే గ్రామాల్లో తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. ప్రస్తుతం గుర్తులు కేటాయించడంతో ఇక వాటితో ప్రచారం ప్రారంభించారు. సోషల్ మీడియాలో వారికి కేటాయించిన గుర్తులతో హోరెత్తిస్తున్నారు.