News January 26, 2025

ప్రత్యేక అలంకరణలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్‌లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారు ఆదివారం సందర్భంగా ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు..

Similar News

News February 14, 2025

గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి సహకరించాలి: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్మాణానికి రైతులు తమ భూములు అందించి సహకరించాలని కలెక్టర్ సత్య శారదా దేవి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో గ్రీన్ ఫిల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మాణానికి భూ సేకరణ కోసం సంగెం గ్రామానికి చెందిన రైతులతో చర్చించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దేశాభివృద్ధికి రహదారులు చాలా అవసరమని తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందన్నారు.

News February 14, 2025

వరంగల్ మార్కెట్‌లో ఉత్పత్తుల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే 5,531 మిర్చి రూ.11 వేలు, దీపిక మిర్చి రూ.17,500, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 1048 రకం మిర్చి రూ.11 వేలు, మక్కలు (బిల్టీ) రూ. 2,355, సూక పల్లికాయ రూ.6,500, పచ్చి పల్లికాయకి రూ.4,500 ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.

News February 14, 2025

వరంగల్ ఎంజీఎంలో పోలీసుల తనిఖీలు

image

విజిబుల్ పోలీసింగ్‌తో పాటు నేరాల నియంత్రణలో భాగంగా మట్టెవాడ పోలీసులు శుక్రవారం సాయంత్రం ఎంజీఎంలో పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు ఆస్పత్రి పరిసరాల్లో అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను, బ్యాగులను తనిఖీ చేయడంతో పాటు వారి వివరాలను నమోదు చేశారు. ఈ తనిఖీల్లో మట్టెవాడ ఎస్ఐ విఠల్, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

error: Content is protected !!