News December 8, 2024

ప్రత్యేక రూపంలో భద్రకాళి అమ్మవారు

image

వరంగల్ లోని ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళీ అమ్మవారు ఈ రోజు ఆదివారం ప్రత్యేక రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి, మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అర్చకులు భక్తులకు వేద ఆశీర్వచనం అందించి, తీర్థప్రసాదాలు వితరణ చేశారు.

Similar News

News January 17, 2025

వరంగల్ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌కు 2 రోజులు సెలవులు రానున్నట్లు మార్కెట్ సెక్రటరీ నిర్మల తెలిపారు. శనివారం వారాంతపు యార్డు బంద్, ఆదివారం సాధారణ సెలవు నేపథ్యంలో మార్కెట్ బంద్ ఉండనుంది. కావున రైతులు విషయాన్ని గమనించి ఈ రెండు రోజులు మార్కెట్‌కి సరుకులు తీసుకొని రావద్దని, విషయాన్ని గమనించాలని సూచిస్తున్నారు.

News January 17, 2025

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా ఉంటుంది: ఎంపీ కావ్య

image

కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వరంగల్ ఎంపీ కడియం కావ్య అన్నారు. రఘునాథపల్లి మండలం నిడిగొండ సమీపంలో నిర్వహించిన కాంగ్రెస్ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో పేద, బడుగు, బలహీన వర్గాలన్నింటికీ రేవంత్ రెడ్డి సర్కార్ అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.

News January 17, 2025

సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ ప్రావీణ్య

image

త్వరలో రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల కోసం నిర్వహిస్తున్న సర్వేలో భాగంగా అర్హులైన లబ్ధిదారుల వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలని హన్మకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. హనుమకొండ వడ్డేపల్లి పరిధిలోని టీఎన్జీవోస్ కాలనీలో ప్రభుత్వ పథకాల కోసం నిర్వహిస్తున్న సర్వేను నేడు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.