News October 2, 2024
ప్రత్యేక రైళ్లను పొడిగించిన దక్షిణ మధ్య రైల్వే
ప్రయాణీకుల రద్దీ మేరకు ఉమ్మడి కృష్ణా జిల్లా మీదుగా నరసాపురం(NS), హైదరాబాద్(HYD) మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే(SCR) పేర్కొంది. నం.07631 HYD- NS ట్రైన్‌ను OCT 5 నుంచి NOV 30 వరకు ప్రతి శనివారం, నం.07632 NS- HYD ట్రైన్‌ను OCT 6 నుంచి DEC 1 వరకు ప్రతి ఆదివారం నడపనున్నట్లు SCR తెలిపింది. కాగా ఈ ట్రైన్లు జిల్లాలో విజయవాడ, గుడివాడ, కైకలూరు స్టేషన్లలో ఆగుతాయి.
Similar News
News October 12, 2024
కృష్ణా: దసరా.. మీ VILLAGE స్పెషల్ ఏంటి.?
దసరా పండుగ అనగానే అందరికీ పల్లెటూరు గుర్తుకు వచ్చేస్తుంది. ఉరుకుల పరుగుల జీవితంలో ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ ఉన్నవారు తిరిగి సొంతూరుకు రావడం, బంధువులు, స్నేహితులు కలిసి ఊరంతా సంతోషంగా తిరుగుతూ ఉంటారు. ఊరిలో అందరినీ పలకరిస్తూ.. ఉంటే ఆ ఆనందం మాట్లల్లో చెప్పలేని సంతోషాన్ని ఇస్తుంది. ప్రతి ఊరితో ఒక్కో విధంగా పండుగను జరుపుకుంటారు. మరి మీ ఊరిలో దసరా వేడుకలకు ఏం చేస్తారో కామెంట్ చేయండి.
News October 12, 2024
ఈ దసరా మీ అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలి: మంత్రి కొల్లు రవీంద్ర
మంత్రి కొల్లు రవీంద్ర రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుతూ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. అసత్యంపై సత్యం, అధర్మంపై ధర్మం, అధైర్యంపై ధైర్యం, చెడుపై మంచి విజయం సాధించిన రోజైన విజయదశమి పర్వదినం విజయానికి సంకేతంగా నిలిచిందని కొల్లు పేర్కొన్నారు. దుర్గా మాత కరుణతో ఈ దసరా పర్వదినం అందరి జీవితాల్లో ఆనందాన్ని నింపాలని కోరుకుంటున్నానన్నారు.
News October 12, 2024
విజయవాడ: శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం విశిష్టత
కనకదుర్గమ్మ అమ్మవారు శనివారం విజయ దశమి రోజున రాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాజరాజేశ్వరీదేవి భువన బ్రహ్మాండాలకు ఆరాధ్య దేవతగా మహా త్రిపుర సుందరిగా పూజలు అందుకుంటుందని పండితులు తెలిపారు. పరమేశ్వరుడి అంకం ఆసనంగా తనను కొలిచిన భక్తులకు ఇచ్ఛా, జ్ఞాన, క్రియా శక్తులను అనుగ్రహిస్తుందన్నారు. అనంత శక్తి స్వరూపమైన శ్రీ చక్రానికి రాజేశ్వరి దేవి అధిష్టాన దేవత అని పండితులు చెబుతారు.