News January 3, 2025

ప్రధానమంత్రి పర్యటన ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: కలెక్టర్

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటన ఏర్పాట్లను పూర్తిచేయాలని అనకాపల్లి కలెక్టర్ విజయ కృష్ణన్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జిల్లా అధికారులతో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. జనవరి 8న అచ్చుతాపురం, నక్కపల్లిలో పలు పరిశ్రమలను విశాఖ నుంచి ప్రధాని వర్చువల్ విధానంలో శంకుస్థాప చేస్తారని వెల్లడించారు. అనంతరం ప్రజలతో ముఖాముఖిలో పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

కేజీహెచ్‌లో బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రారంభం

image

కేజీహెచ్‌లోని గైనిక్ వార్డులో బాలింతల కోసం బ్రెస్ట్ ఫీడింగ్ యూనిట్ ప్రాజెక్ట్‌ను ఆయుష్మాన్‌లో భాగంగా ఏర్పాటు చేశారు. కేజీహెచ్ సూపరింటెండెంట్ ఐ.వాణి ఈ యూనిట్ ప్రారంభించారు. ఈ యూనిట్‌తో పిల్లల తల్లులకు అన్ని రకాల ఉపయోగాలు చేకూరుతాయని సూపరింటెండెంట్ వివరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య వైద్యులు, సిబ్బంది, నిర్వాహకులు పాల్గొన్నారు.

News November 28, 2025

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగుల పంపిణీ: విశాఖ జేసీ

image

డిసెంబర్ నెలలో రేషన్ డిపోలలో రాగులు పంపిణీ చేయనున్నట్లు జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్ శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులకు మూడు కేజీల బియ్యానికి బదులుగా మూడు కేజీల రాగులు అందజేయనున్నట్లు వెల్లడించారు. రేషన్ డిపోలకు వెళ్లే లబ్ధిదారులు ఈ విషయాన్ని గమనించి ప్రభుత్వం అందిస్తున్న పోషకాహారాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు.

News November 28, 2025

విశాఖ జూ పార్కుకు కొత్త నేస్తాల రాక

image

విశాఖ జూ పార్కుకు జంతు మార్పిడి విధానంలో కొత్త జంతువులు తీసుకొచ్చారు. జార్ఖండ్ రాష్ట్రం బిర్ష జూ పార్కు నుంచి హిమాలయన్ నల్లని ఎలుగుబంట్లు, గరియల్, స్పార్టెడ్ డవ్, సిల్వర్ పీజంట్ అనే జంతువులను, పక్షులను విశాఖ జూకు తీసుకొచ్చినట్లు క్యూరేటర్ జీ.మంగమ్మ తెలిపారు. విశాఖ జూ నుంచి కొన్ని జంతువులను అక్కడి జూకి పంపించినట్లు చెప్పారు. కొత్తగా వచ్చిన వీటిని కొన్ని రోజులపాటు క్వారంటైన్‌లో ఉంచుతామన్నారు.