News December 6, 2024
ప్రధానితో భేటీ అద్భుతమైన అనుభవం: మంత్రి భరత్
ప్రధాని మోదీని మంత్రి టీజీ భరత్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఢిల్లీలో కలిసి పలు అంశాలపై ఆయనకు వినతి పత్రం అందజేశారు. ‘ప్రధాని మోదీని కలవడం గౌరవంగా భావిస్తున్నా. గతంలో ఒక కమిటీకి ఛైర్మన్‌గా మా నాన్న టీజీ వెంకటేశ్ చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకోవడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. పీఎంను కలిసి చర్చించే అవకాశం రావడం నాకు నిజంగానే ఒక అద్భుతమైన అనుభవం’ అని మంత్రి ట్వీట్ చేశారు.
Similar News
News January 21, 2025
ఇద్దరు ఐపీఎస్‌ల ప్రేమ వివాహం.. కర్నూలులో పోస్టింగ్..!
ఐపీఎస్ భార్యాభర్తలిద్దరూ కర్నూలులో విధులు నిర్వహించనున్నారు. ఎస్పీగా విక్రాంత్ పాటిల్, ఏపీఎస్పీ 2వ బెటాలియన్ కమాండెంట్‌గా ఆయన సతీమణి దీపికను నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా విక్రాంత్ పాటిల్, కాకినాడ ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా దీపిక ఉన్నారు. కాగా, తన అన్న స్నేహితుడైన విక్రాంత్ పాటిల్‌తో పరిచయం ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు.
News January 21, 2025
కాబోయే సీఎం లోకేశ్.. మంత్రి వ్యాఖ్యలపై దుమారం
మంత్రి నారా లోకేశ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలనే టీడీపీ నేతల డిమాండ్ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ అంశం కూటమిలో దుమారానికి దారితీసింది. ఈ క్రమంలో మంత్రి TG <<15206909>>భరత్<<>> మరో అడుగు ముందుకేసి ‘ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఫ్యూచర్‌లో కాబోయే సీఎం లోకేశ్’ అంటూ జ్యూరిచ్‌లో సీఎం చంద్రబాబు ముందే కుండబద్దలు కొట్టారు. ఈ అంశం మరింత చర్చకు తావిచ్చింది. మరి మంత్రి భరత్ వ్యాఖ్యలపై మీరేమంటారు. కామెంట్ చేయండి.
News January 21, 2025
కర్నూలు జిల్లా కొత్త ఎస్పీ నేపథ్యం ఇదే!
కర్నూలు జిల్లా నూతన ఎస్పీగా <<15208705>>ఐపీఎస్<<>> అధికారి విక్రాంత్ పాటిల్ నియమితులైన విషయం తెలిసిందే. విక్రాంత్ గతంలో చిత్తూరు జిల్లా ఎస్పీ, విజయవాడ డీసీపీ, చింతలవలస ఏపీఎస్పీ 5వ బెటాలియన్ కమాండెంట్, మన్యం జిల్లా ఎస్పీగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఆయన కాకినాడ జిల్లా ఎస్పీగా, ఏపీఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్‌గా ఉన్నారు. ఆయన సతీమణి దీపికా పాటిల్ కూడా ఐపీఎస్ అధికారే. గతంలో కర్నూలు ఏఎస్పీగా సేవలందించారు.