News June 27, 2024
ప్రధాని మోదీతో వేమిరెడ్డి భేటీ

దేశ ప్రధాని మోదీతో టీడీపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఢిల్లీలో బుధవారం జరిగిన ఈ భేటీలో నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ అంశాలపై ఎంపీలతో ప్రధాని చర్చించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు, లోక్‌సభ స్పీకర్ ఎన్నికపై వారు మాట్లాడారు.
Similar News
News February 26, 2026
YCPలోనే ఆదాల.. పార్టీ మార్పు లేనట్లే!

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి సైలెంట్ అయిపోయారు. వైసీపీని వీడి బీజేపీలో చేరుతారని గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అందుకు తగ్గట్టుగానే ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇవాళ నెల్లూరుకు వచ్చిన జగన్‌ను ఆదాల కలిశారు. దీంతో మాజీ MP పార్టీ మార్పు ఊహాగానాలకు చెక్ పడింది.
News February 26, 2026
నెల్లూరు జిల్లాలో స్క్రబ్ టైఫస్‌తో ఒకరి మృతి?

నెల్లూరు జిల్లా బిట్రగుంట మండలం నాగులవరానికి చెందిన టీడీపీ నాయకుడు(47) చనిపోయారు. కావలిలో నివాసం ఉండే ఆయన వారం కిందట పొలం పనులకు వెళ్లినప్పుడు కాలికి ఏదో కుట్టినట్లు అనిపించింది. తర్వాత జ్వరం రావడంతో ఆసుపత్రికి వెళ్లారు. ఎంతకి తగ్గకపోవడంతో చెన్నైకి తీసుకెళ్లారు. ఈనెల 24వ తేదీ చనిపోయారు. స్క్రబ్ టైఫస్‌తో మరణించినట్లు డాక్టర్లు రిపోర్టు ఇచ్చారని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.
News February 26, 2026
నెల్లూరు: మీ ఏరియాలో పాలు బాగుంటాయా?

రాజమండ్రిలో కల్తీ పాలు తాగి పలువురు చనిపోయారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నారు. పాల నాణ్యతను నిర్ధారించేందుకు మాజిక్ బాక్స్ అందుబాటులోకి వచ్చింది. దీంతో అక్కడికక్కడే పాల కల్తీని గుర్తిస్తున్నారు. జిల్లాలో100 వరకు డెయిరీలు ఉండగా.. వీటిల్లో తనిఖీలు చేస్తున్నట్లు అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ వెంకటేశ్వర రావు Way2Newsకు వివరించారు. మీ దగ్గర పాలు బాగుంటాయా? లేదా?


