News August 8, 2024
ప్రధాని మోదీని కలిసిన ఈటల రాజేందర్

జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మల్కాజిగిరి ఎంపీ, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీని నూలు పోగుల దండతో సత్కరించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం ప్రధానితో అభివృద్ధి, పలు సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు.
Similar News
News January 8, 2026
కరీంనగర్: మితిమీరిన వేగం ప్రాణాంతకం: డీటీసీ

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా నుస్తులాపూర్ వద్ద రవాణా, ట్రాఫిక్ పోలీసులు ఉమ్మడిగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడపడం ప్రాణాంతకమని డీటీసీ పురుషోత్తం పేర్కొన్నారు. ఎస్‌హెచ్-1 రహదారిపై తనిఖీలు చేపట్టి, నిబంధనలు ఉల్లంఘించిన 10 వాహనాలకు జరిమానా విధించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ వేగ నియంత్రణ పాటించాలని సూచించారు.
News January 8, 2026
కొత్తపల్లి: అక్రమ ఇసుక రవాణాపై వేటు: కలెక్టర్

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా ఇసుక రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి హెచ్చరించారు. బుధవారం సీపీ గౌస్ ఆలం తో కలిసి తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఇసుక క్వారీని ఆమె తనిఖీ చేశారు. ఎల్ఎండీ రిజర్వాయర్ పూడికతీత, ఇసుక వేరు చేసే ప్రక్రియను పరిశీలించి, రికార్డులను తనిఖీ చేశారు. పరిమితికి మించి లోడింగ్ చేసిన, అనధికార వాహనాలు వినియోగించినా ఉపేక్షించబోమన్నారు.
News January 8, 2026
KNR: ‘బీసీ సబ్‌ప్లాన్ నిధులను విడుదల చేయాలి’

బీసీ సబ్‌ప్లాన్ నిధులను తక్షణమే విడుదల చేయాలని కోరుతూ.. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లా కలెక్టరేట్లో వినతిపత్రాన్ని అందజేశారు. పార్టీ అధ్యక్షలు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షలు గంగిపెళ్లి అరుణ, రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ చాంద్ పాషా ఉన్నారు.


