News August 8, 2024
ప్రధాని మోదీని కలిసిన ఈటల రాజేందర్
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని మల్కాజిగిరి ఎంపీ, హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మోదీని నూలు పోగుల దండతో సత్కరించారు. తెలంగాణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. అనంతరం ప్రధానితో అభివృద్ధి, పలు సమస్యలపై చర్చించి వినతిపత్రం అందజేశారు.
Similar News
News September 18, 2024
నిర్దేశించిన గడువులోగా రైస్ డెలివరీ పూర్తి చేయాలి: కలెక్టర్
నిర్దేశించిన గడువులోగా ఖరీఫ్ 2023-24, రబీ సీజన్‌లకు సంబంధించి పెండింగ్ రైస్ డెలివరీని తప్పనిసరిగా పూర్తి చేయాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీ హర్ష మిల్లర్లను ఆదేశించారు. అదనపు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్‌తో కలిసి జిల్లాలోని రైస్ మిల్లర్లు, సంభందిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైస్ డెలివరీ ఆలస్యం చేస్తున్న రైస్ మిల్లులను అధికారులు క్షేత్ర స్థాయిలో తనిఖీ చేయాలని సూచించారు.
News September 18, 2024
మాదక ద్రవ్యాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు: కరీంనగర్ కలెక్టర్
గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో వర్చువల్ నార్కో సమన్వయ సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు మిషన్ పరివర్తన్‌లో భాగంగా గంజాయి, డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించాలన్నారు.
News September 18, 2024
సిరిసిల్ల: పత్తి దిగుబడిపై దిగాలు
సిరిసిల్ల జిల్లాలో పత్తి పంట సాగు చేసిన రైతులు తెల్లబోతున్నారు. ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన అధిక వర్గాలు పత్తి రైతులను పరేషాన్ చేస్తున్నాయి. భారీ వర్షాలతో పంట దెబ్బతిని దిగుబడిపై ప్రభావం చూపింది. మరోవైపు తెగుళ్లు మొదలు కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆకులకు తెగుళ్లు సోకి ఎర్ర రంగులోకి మారుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. కాగా, జిల్లాలో 49,332 ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు.