News April 10, 2025
ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధమవుతున్న అమరావతి

ఎన్టీఆర్: ఏప్రిల్ 3వ వారంలో ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ప్రధాని సభ నిమిత్తం అమరావతిలో విశాల ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి అమరావతికి లభించిన నిధులకు కేంద్రం రూ.750కోట్లను కలిపి రూ.4,825 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News October 18, 2025
జనగామ: ధాన్యం గ్రేడింగ్లో సందేహాలా?

ధాన్యం కొనుగోలు సమయంలో గ్రేడింగ్ నిర్ధారణలో సందేహాలుంటే సంబంధిత శాఖల అధికారులను సంప్రదించాలని కలెక్టర్ షేక్ రిజ్వాన్ బాషా కోరారు. నిర్ధారించుకునేందుకు డీఏవో కార్యాలయం(8977745482), పౌర సరఫరాల శాఖ(9966361171), టెక్నికల్ అసిస్టెంట్ (9666222500) నంబర్లలో సంప్రదించి నిర్ధారించుకోవాలని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 18, 2025
‘డ్యూడ్’, ‘తెలుసు కదా’ చిత్రాల కలెక్షన్స్ ఇలా!

* ప్రదీప్ రంగనాథన్ నటించిన ‘డ్యూడ్’ మూవీకి తొలిరోజు మంచి కలెక్షన్లు వచ్చాయి. ఈ చిత్రానికి రూ.10 కోట్లకుపైగా నెట్ కలెక్షన్స్ వచ్చాయని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
* సిద్ధూ జొన్నలగడ్డ నటించిన ‘తెలుసు కదా’ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్లు వచ్చినట్లు తెలుస్తోంది. తొలిరోజు ఇండియాలో రూ.2 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
* వీటిలో ఏ మూవీ నచ్చిందో కామెంట్ చేయండి.
News October 18, 2025
బొబ్బిలి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

బొబ్బిలి మున్సిపాలిటీలోని ఇందిరమ్మ కాలనీ సమీపంలో రైలు నుంచి జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు చెప్పారు. విజయనగరం నుంచి రాయగడ వైపు వెళ్తున్న రైలు నుంచి జారీ పడడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతిని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని రైల్వే పోలీసులు కోరారు.