News April 10, 2025
ప్రధాని మోదీ పర్యటనకు సిద్ధమవుతున్న అమరావతి

ఎన్టీఆర్: ఏప్రిల్ 3వ వారంలో ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటనకు రానున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఆయన పర్యటన విజయవంతం చేసేందుకు ఏర్పాట్లు పూర్తిచేస్తోంది. ప్రధాని సభ నిమిత్తం అమరావతిలో విశాల ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇటీవలే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ నుంచి అమరావతికి లభించిన నిధులకు కేంద్రం రూ.750కోట్లను కలిపి రూ.4,825 కోట్లు విడుదల చేసిన సంగతి తెలిసిందే.
Similar News
News March 17, 2026
కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

వనపర్తి జిల్లాలో 21 ఉష్ణోగ్రత నమోదు కేంద్రాలలో గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రత వివరాలు ఇలా ఉన్నాయి. అత్యధికంగా కానాయిపల్లిలో 38.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. మదనపూర్ 38.2, వెలుగొండ 37.4, వీపనగండ్ల 37.2, పెద్దమందడి, దగడ 36.9, ఆత్మకూరు, వనపర్తి 36.3, అమరచింత, జానంపేట 35.8, శ్రీరంగాపూర్ 35.5, పానగల్, రేమద్దుల, పెబ్బేరు, ఘన్‌పూర్ 35.3, విలియంకొండ 35.1 డిగ్రీలుగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
News March 17, 2026
మెదక్: అసెంబ్లీ సెక్రటరీకి వాయిదా తీర్మానం ఇచ్చిన హరీశ్ రావు

రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై అసెంబ్లీలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ప్రవేశపెట్టింది. మాజీ మంత్రి హరీశ్ రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సెక్రటరీకి తీర్మానం అందజేశారు. పెండింగ్‌లో ఉన్న రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, జీపీఎఫ్ బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. బకాయిలు రాక రిటైర్డ్ ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
News March 17, 2026
BNGR: రూ.లక్ష బండిపై 90% సబ్సిడీ

SC నిరుద్యోగులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు BNGR కలెక్టరేట్ ప్రకటన విడుదల చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 2 వీలర్‌కు 90%, 3 వీలర్‌కు 70% సబ్సిడీతో EV’s కొనుగోలుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆదాయ, కుల, రేషన్‌కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ జతచేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. రేపటి నుంచి 26 వరకు tgobmms.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చు. # SHARE IT


