News May 6, 2024

ప్రధాని రాక.. ట్రాఫిక్ దారి మళ్లింపు

image

ప్రధాని మోదీ నేడు తూ.గో జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ డైవెర్షన్ అమలు చేస్తున్నారు. కడియం మండలం వేమగిరి నేషనల్ హైవే సమీపంలో బహిరంగ సభ జరుగుతుందన్నారు. విజయవాడ-విశాఖ వైపు వెళ్లే వాహనాలు గుండుగొలను, నల్లజర్ల, దేవరపల్లి, గామన్ బ్రిడ్జ్ మీదుగా విశాఖ వెళ్లాలి. తాడేపల్లిగూడెం వైపు వచ్చే వాహనాలు నల్లజర్ల, దేవరపల్లి, గామన్ బ్రిడ్జ్ మీదుగా రావాలని అధికారులు సూచించారు. SHARE IT

Similar News

News September 30, 2024

ప.గో: విషాదం.. కరెంట్‌ షాక్‌తో ITI విద్యార్థి మృతి

image

ప.గో జిల్లా ఆకివీడులో విషాదం నెలకొంది. కరెంట్ షాక్‌తో సాయినగర్‌కు చెందిన యారపాటి హేమంత్(19) మృతి చెందాడు. ఎస్ఐ నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం.. గణపతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయినగర్‌లో అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో హేమంత్‌కు విద్యుత్ షాక్ తగలడంతో మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. హేమంత్ ITI చదువుతున్నాడు.

News September 30, 2024

విషాదం.. 18వ అంతస్తు నుంచి దూకి తల్లీకూతుళ్ల సూసైడ్

image

భీమవరంలో విషాదం నెలకొంది. 3ఏళ్ల కుమార్తెతో కలిసి 18వ అంతస్తు నుంచి దూకి తల్లి సూసైడ్ చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీమవరానికి చెందిన మానస(30) భర్త, కూతురు కృషితో కలిసి HYDలోని నార్సింగి సమీపంలో నివాసం ఉంటోంది. భర్త సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి. ఆదివారం రాత్రి మానస కూతురితో కలిసి బిల్డింగ్‌ పైనుంచి దూకేసింది. అనారోగ్యం కారణంగా ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

బాగా చదవాలన్నందుకు కాలువలో దూకిన విద్యార్థి

image

బాగా చదివి పదో తరగతిలో ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలని చెప్పినందుకు ఓ విద్యార్థి కాలువలో దూకేశాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది. కొత్తూరుకు చెందిన రామకృష్ణారావుకు కుమారుడు పోలినాయుడు(16), కుమార్తె సంతానం. ఆదివారం కుమార్తె పుట్టిన రోజు వేడుకలను పెద్దింటమ్మ ఆలయం వద్ద నిర్వహించారు. ఈ క్రమంలో పేరెంట్స్, బంధువులు ‘పది’లో మంచి మార్కులు తెచ్చుకోవాలని పోలినాయుడితో అనగా.. మనస్తాపానికి గురై వెళ్లి కాలువలో దూకేశాడు.