News January 8, 2025
ప్రధాని సభకు ఉమ్మడి జిల్లా నుంచి ఆర్టీసీ బస్సులు
దేశ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు బుధవారం సాయంత్రం విచ్చేస్తున్న సంగతి తెలిసిందే. జన సమీకరణలో భాగంగా విజయనగరం ఆర్టీసీ డిపో నుంచి 70, ఎస్.కోట డిపో నుంచి 30 చొప్పున..మొత్తం 100బస్సులతో జనాలను తరలించనున్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని పార్వతీపురం, సాలూరు, పాలకొండ ఆర్టీసి డిపోల నుంచి మొత్తం 80 బస్సులను ప్రధాని సభకు వైపు మళ్లించినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News January 23, 2025
ఆనందంగా గడిపారు.. అంతలోనే విషాదం
అగనంపూడి టోల్‌గేట్ వద్ద జరిగిన ప్రమాదంలో <<15230832>>మృతి చెందిన<<>> గొర్లి మన్మథరావు(38), అరుణ కుమారి (32) సంక్రాంతికి పిల్లలతో కలిసి గడిసింగుపురం వచ్చారు. గ్రామంలో ఆనందంగా గడిపిన వారు.. కనుమ మరుసటి రోజే పయనమయ్యారు. ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్న మన్మథరావు బుధవారం సెలవు పెట్టి భార్యతో కలిసి బ్యాంకుకు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో ఇద్దరూ ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.
News January 23, 2025
పార్వతీపురం: వలస వెళ్లి విగత జీవులయ్యారు..!
బతుకుతెరువుకు ఊరొదిలి వెళ్లిన ఆ దంపతులను లారీ రూపంలో మృత్యువు వెంటాడడంతో ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. <<15222234>>అగనంపూడి <<>>టోల్‌గేట్ వద్ద నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో <<15225242>>మృతి చెందిన <<>>గొర్లి మన్మథరావు, అరుణకుమారి జి.ఎం వలస(M) గడిసింగుపురం నుంచి రెండేళ్ల క్రితం వలస వచ్చారు. మన్మథరావు ఫార్మాసిటీలో వెల్డర్‌గా పనిచేస్తున్నాడు. కొడుకు నిఖిల్, కూతురు నీలిమ ఉన్నారు.
News January 23, 2025
విజయనగరం జిల్లాలో 5 ఆసుపత్రులు.. 13 ప్రత్యేక వైద్య బృందాలు
విజయనగరం జిల్లాలో గురువారం నుంచి దివ్యాంగుల పింఛన్ల పరిశీలన కార్యక్రమం జరగనున్న సంగతి తెలిసిందే. దీని కోసం జిల్లాలోని ఐదు ఆసుపత్రులు, 13 ప్రత్యేక వైద్య బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. శారీరక దివ్యాంగుల కోసం గజపతినగరం, చీపురుపల్లి, రాజాం, ఎస్ కోట, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రులు, అందుల కోసం రాజాం, GGH, ఘోసాసుపత్రి, మూగ చెవిటి వారి కోసం GGH, ఘోషాసుపత్రిలో కేంద్రాలను ఏర్పాటు చేశారు.