News January 25, 2025

ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తున్నాం: శ్రీధర్ బాబు

image

మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు ‘డ్రీమ్ ల్యాబ్ టెక్నాలజీస్’ ప్రతినిధి నిక్ మాయెన్‌కోర్ట్‌తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పెట్టుబడుల అవకాశాలు, సాంకేతిక మౌలిక సదుపాయాలు, ఆర్థిక అభివృద్ధి తదితర అంశాలపై చర్చించారు. డ్రీమ్ ల్యాబ్ టెక్నాలజీస్ వంటి ప్రముఖ సంస్థలతో కలసి పనిచేయడం ద్వారా రాష్ట్రానికి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉందని ఆయన అన్నారు.

Similar News

News October 20, 2025

పొన్నూరు: ఫొటో కోసం చీరలో రూ.1లక్ష పెట్టమన్నాడు.. చివరకు

image

పొన్నూరులో సినిమాను తలపించేలా ఘరానా మోసం జరిగింది. విద్యానిగర్‌లోని రాధాకృష్ణమూర్తి ఇంట్లో చొరబడిన దొంగ, బహుమతులు వచ్చాయని నమ్మించి, ఫొటో తీయడానికి లక్ష రూపాయల నగదును చీరలో పెట్టి ఉంచాలని చెప్పాడు. ఆ తర్వాత ఆ లక్ష తీసుకొని ఉడాయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు అర్బన్ సీఐ వీరా నాయక్ తెలిపారు.

News October 20, 2025

వరంగల్: మాజీ MLA ఇంట్లో పేకాట.. 13 మంది అరెస్ట్

image

వరంగల్‌లో మాజీ MLA దోనెపూడి రమేశ్‌బాబు ఇంట్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. వీరిలో WGL స్టేషన్ రోడ్డు ప్రాంతానికి చెందిన హరిబాబు, కాజీపేటకు చెందిన సదానందం, పుట్ట మోహన్‌రెడ్డి, హంటర్ రోడ్డు శాయంపేట ప్రాంతానికి చెందిన మాజీ కార్పొరేటర్ శివశంకర్, మామునూరుకు చెందిన తిరుపతిరెడ్డి, గిర్మాజీపేటకు చెందిన శ్రీనివాసరావు, జావీద్, కొత్తవాడకు చెందిన రాజకిశోర్ తదితరులు ఉన్నారు.

News October 20, 2025

ముత్యాల గర్భం గురించి తెలుసా?

image

ప్రెగ్నెంట్ అయినా కడుపులో బిడ్డలేని పరిస్థితినే ముత్యాల గర్భం అంటారు. కడుపు పెరుగుతుంది, వాంతులు అవుతాయి, ప్రెగ్నన్సీ హార్మోన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. సాధారణంగా ఆరోగ్యకరమైన స్పెర్మ్ , ఒక ఆరోగ్యకరమైన అండంతో సంయోగం చెందితే పిండం ఏర్పడుతుంది. అలా రెండు క్రోమోజోములు బిడ్డకు వస్తాయి. కానీ ముత్యాల గర్భం శుక్రకణం క్రోమోజోములు లేని ఖాళీ అండంతో ఏర్పడుతుంది. ఇది బుడగల ఆకారంలో ఎదుగుతుంది.