News December 12, 2024

ప్రపంచాన్ని మార్చే శక్తి కమ్యూనిజానికే ఉంది: తమ్మినేని

image

ప్రపంచాన్ని మార్చే శక్తి కమ్యూనిజానికి మాత్రమే ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. గురువారం ఏదులాపురంలో పాలేరు డివిజన్ 8వ మహాసభ నిర్వహించారు. పెట్టుబడిదారులకు, దోపిడీదారులకు కమ్యూనిస్టులంటే భయమని చెప్పారు. అందుకే కమ్యూనిస్టులపై నిత్యం విష ప్రచారం చేస్తూ, బురద చల్లుతూ ప్రజల్ని మభ్యపెడుతూ ఉంటారని విమర్శించారు.

Similar News

News November 20, 2025

ఖమ్మం జిల్లాలో 43 బ్లాక్ స్పాట్‌ల గుర్తింపు

image

మొంథా తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో రహదారులు దెబ్బతిన్నాయి. జిల్లాలో 43బ్లాక్ స్పాట్‌లను అధికారులు గుర్తించారు. NHAIపరిధిలో 4చోట్ల, జాతీయ రహదారుల్లో 33చోట్ల, ఇతర రోడ్లపై 6చోట్ల ప్రమాదకర ప్రాంతాలు ఉన్నాయి. జిల్లాలో 126కిలోమీటర్ల మేర రోడ్లు ధ్వంసమైనట్లు నివేదికలో తేలింది. మరమ్మతుల కోసం రూ.15కోట్లు అవసరమని అంచనా వేశారు. మున్సిపల్ పరిధిలోని 470గుంతల పూడ్చివేతకు 6ప్యాకేజీలుగా టెండర్లు చేపట్టారు.

News November 20, 2025

రేగళ్లపాడు సెక్రటరీని సస్పెండ్ చేసిన కలెక్టర్

image

ఇందిరమ్మ ఇళ్ల బిల్లుల మంజూరుకు లంచం డిమాండ్‌ చేసిన పంచాయతీ కార్యదర్శి శివమాధవరావు సస్పెండయ్యారు. సత్తుపల్లి(M) రేగళ్లపాడులో లబ్ధిదారులు ఎడుకొండలు, సీతకు బిల్లులు చెల్లించేందుకు కార్యదర్శి ఈ నెల 4న రూ. 10 వేలు డిమాండ్‌ చేశారు. బాధితులు టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయగా, హౌసింగ్ ఈఈ శ్రీనివాస్ విచారణ చేపట్టారు. ఈఈ నివేదిక ఆధారంగా కలెక్టర్ కార్యదర్శిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

News November 20, 2025

ఖమ్మం: గంజాయి కేసు.. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష

image

గంజాయి కేసులో పట్టుబడిన ఇద్దరు నిందితులకు ఖమ్మం మొదటి అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి కె. ఉమాదేవి బుధవారం సంచలన తీర్పు చెప్పారు. ఇద్దరికి 20 ఏళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున జరిమానా విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తీర్పు అనంతరం ప్రాసిక్యూషన్‌కు సహకరించిన అధికారులను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ప్రత్యేకంగా అభినందించారు.