News November 22, 2024
ప్రపంచ జ్ఞాపకశక్తి పోటీల విజేతను అభినందించిన కలెక్టర్
ప్రపంచ స్థాయి జ్ఞాపకశక్తి పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన విజేత జై బల్దియ జైన్ని గురువారం జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్ అభినందించారు. బల్దియా జైన్ 51 సెకండ్లలో 125 తేదీలను గుర్తుపెట్టుకుని ప్రపంచ రికార్డు బద్దలు కొట్టారు. మానసిక గణన విభాగంలో అద్భుత విజయం సాధించిన బల్దియా జైన్ భారతదేశ కీర్తి ప్రతిష్ఠలను పెంచారని కలెక్టర్ అభినందించారు.
Similar News
News November 22, 2024
కావలిలో వ్యక్తి దారుణ హత్య !
కావలి సమీపంలోని జగనన్న లే ఔట్ లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మృతుడు ముసునూరుకు చెందిన ముప్పవరపు శాంతి కుమార్(35)గా పోలీసులు గుర్తించారు. ఓ యువతితో కలిసి జగనన్న లేఔట్కి వచ్చిన శాంతి కుమార్, యువతి వెళ్లిపోయిన కాసేపటికి వచ్చి చూసేసరికి మృతి చెందినట్లు స్థానిక మహిళ తెలిపారు. ఘటన స్థలానికి కావలి DSP శ్రీధర్, రూరల్ సీఐ రాజేశ్వరరావు చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News November 22, 2024
మాదకద్రవ్యాలకు లోనైతే జీవితం అంధకారం : ఎస్పీ
మాదకద్రవ్యాల వ్యసనానికి లోనైన వ్యక్తి జీవితం అంధకారంలోకి వెళ్తుందని జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ తెలిపారు. శుక్రవారం నెల్లూరు జిల్లాలోని పలు కళాశాలలో ఆయన మాదకద్రవ్యాలపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలు పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకొని, సమయాన్ని వినియోగించుకుంటూ బాగా చదవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
News November 22, 2024
23, 24 తేదీల్లో మీ ఓటును సరిచూసుకోండి : కలెక్టర్
ఎన్నికల సంఘం వారి ఆదేశాల మేరకు అందరు బూత్ స్థాయి అధికారులచే ఈ నెల 23, 24 తేదీల్లో ఓటర్లు వారి పేరు ఓటర్ల జాబితాలో నమోదైందో లేదో పరిశీలించుకోవాలని కలెక్టర్ ప్రకటనలో తెలిపారు. ఆ రోజులలో బూత్ స్థాయి అధికారులు పోలింగ్ కేంద్రాల వద్ద ముసాయిదా ఓటర్ల జాబితా, ఫారం 6, ఫారం 7, ఫారం 8 లతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలు వరకు దరఖాస్తులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.