News April 11, 2025

ప్రపంచ దేశాల సుందరీమణుల పర్యటనకు సిద్ధం చేయాలి: కలెక్టర్

image

మే 14న హైదరాబాద్ నుంచి ప్రపంచ సుందరి పోటీల్లో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన సుందరగిరిలో వరంగల్ పర్యటనలో భాగంగా కాళోజీ కళాక్షేత్రం సందర్శించనున్నారని, అందుకు సంబంధించిన ఏర్పాట్లు సిద్ధం చేయాలని కలెక్టర్ ప్రావీణ్య అధికారాలను ఆదేశించారు. రెవెన్యూ, పర్యాటక, ఇతర శాఖల అధికారులతో సమన్యాయ సమావేశం నిర్వహించారు. చరిత్ర గల వరంగల్‌ను ప్రపంచ దేశాల సుందరగిరిలో సందర్శించేందుకు దక్కిన అరుదైన గౌరవం అని తెలిపారు.

Similar News

News September 13, 2025

మాజీ మంత్రి శైలజానాథ్‌కు అస్వస్థత

image

మాజీ మంత్రి, వైసీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ అస్వస్థతకు గురయ్యారు. వైరల్‌ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్నా ఈనెల 9న జరిగిన ‘అన్నదాత పోరు’ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

News September 13, 2025

యుద్ధం తర్వాత తొలి మ్యాచ్.. స్టేడియం హౌస్‌ఫుల్: అక్తర్

image

ఆసియా కప్‌లో రేపు భారత్‌తో జరగనున్న మ్యాచ్‌కు టికెట్స్ సేల్ అవ్వట్లేదన్న వార్తలపై పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ‘భావోద్వేగాలు ఉప్పొంగుతున్నాయి. యుద్ధం తర్వాత భారత్‌తో పాక్ తొలిసారి తలపడుతోంది. కచ్చితంగా స్టేడియం హౌస్‌ఫుల్ అవుతుంది. టికెట్లు అమ్ముడవ్వట్లేదని నాతో ఒకరన్నారు. అది వాస్తవం కాదని, అన్నీ సేల్ అయ్యాయని చెప్పాను. ఇదంతా బయట జరుగుతున్న ప్రచారం మాత్రమే’ అని వ్యాఖ్యానించారు.

News September 13, 2025

KNR: ప్రజాభవన్ ముట్టడిస్తాం: USFI

image

USFI నగర కమిటీ సమావేశం KNR సిటీలోని ఓ డిగ్రీ కళాశాలలో నగర అధ్యక్షుడు బుస మణితేజ అధ్యక్షతన సమావేశం జరిగింది. USFI రాష్ట్ర కార్యదర్శి మాదం తిరుపతి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం లాగే ఈ ప్రభుత్వం విద్యారంగంపై సరైన సదస్సు పెట్టకపోవడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయకపోతే ప్రజాభవన్ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.