News August 10, 2024
ప్రపంచ మాస్టర్ అథ్లెటిక్స్ పోటీలకు ఆదోని వాసి

స్వీడన్లోని గోథెన్స్ బర్గ్ వరల్డ్ మాస్టర్స్ అథ్లెటిక్స్ పోటీలకు ఆదోనికి చెందిన ఖాజా బందే నవాజ్ ఎంపికయ్యారని జిల్లా మాస్టర్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాండురంగా రెడ్డి, రవికుమార్ తెలిపారు. ఈనెల 13 నుంచి 25వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ పోటీల్లో 60 ఏళ్ల కేటగిరీలో పాల్గొననున్నారు. ఖాజా బందే నవాజ్కు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అభినందనలు తెలిపారు.
Similar News
News October 22, 2025
2 కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు: జిల్లా జడ్జి

రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేసినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.కబర్ది పేర్కొన్నారు. బుధవారం కర్నూలు, నంద్యాల కలెక్టర్లు, ఎస్పీలతో విక్టిమ్ కాంపెన్సేషన్, అండర్ ట్రయల్ రివ్యూ కమిటీ, హిట్ అండ్ రన్ కేసులపై సమీక్ష నిర్వహించారు. రెండు కేసుల్లో బాధితులకు రూ.12.50 లక్షల నష్టపరిహారం మంజూరు చేశారు. ఆధార్ లేని 125 అనాథ పిల్లల్లో 56 మందికి ఆధార్ కార్డులు జారీ చేశారు.
News October 22, 2025
చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేయాలి: కలెక్టర్

జిల్లాలోని చిన్నపిల్లల సంరక్షణ సంస్థలను తరచూ తనిఖీ చేసి చట్టవిరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన మిషన్ వాత్సల్య, మిషన్ శక్తి సమీక్షా సమావేశంలో ఆమె మాట్లాడారు. సంస్థలకు వచ్చిన నిధులు, ఖర్చులు, మౌలిక వసతుల వివరాలు సమగ్రంగా ఇవ్వాలని ఐసీడీఎస్ పీడీని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికుల నియంత్రణపై చర్యలు వేగవంతం చేయాలని సూచించారు.
News October 22, 2025
ఆదోని ఎంపీపీపై అవిశ్వాస తీర్మానం వాయిదా

ఆదోని మండల ఎంపీపీ దానమ్మపై పెట్టిన అవిశ్వాస తీర్మానం వాయిదా పడింది. 28 ఎంపీటీసీ సభ్యుల్లో కనీసం 17 మంది మద్దతు అవసరమని అధికారులు స్పష్టం చేశారు. తీర్మానానికి అవసరమైన సంఖ్య లేని కారణంగా అధికారులు అవిశ్వాసాన్ని వాయిదా వేశారు. కొన్ని రోజులుగా ఆదోనిలో ఎంపీపీ అవిశ్వాసంపై నెలకొన్న ఉత్కంఠ ఇక్కడితో శాంతించింది. ఎంపీపీగా దానమ్మ కొనసాగనున్నారు.