News November 1, 2024
ప్రపంచ సునామీ అవగాహన సమావేశానికి కోడూరు వాసి

జెనివాలోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో నవంబరు 4న నిర్వహించే ప్రపంచ సునామీ అవగాహన దినోత్సవ సమావేశంలో పాల్గొనడానికి సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం కోడూరుకి చెందిన మారోజు బ్రహ్మచారికి ఆహ్వానం అందింది. ప్రపంచ దేశాల ప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొననున్నారు. సునామీ వచ్చే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, తదితర అంశాలపై ప్రతినిధులకు అవగాహన కల్పిస్తారని శుక్రవారం బ్రహ్మచారి తెలిపారు.
Similar News
News October 20, 2025
NLG: టార్గెట్ రీచ్ అవుతారా..!

మద్యం షాపుల టెండర్లకు ప్రభుత్వం మరోసారి గడువు పొడిగించినా మద్యం వ్యాపారుల నుంచి అంతగా స్పందన కానరావడం లేదు. జిల్లాలో 154 మద్యం దుకాణాలకు సర్కారు ఆశించిన దానికంటే తక్కువ సంఖ్యలో (4,620) దరఖాస్తులు రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గతేడాది 155 దుకాణాలకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఎలాగైనా టార్గెట్ చేరుకోవాలనే సంకల్పంతో ఎక్సైజ్ శాఖ క్షేత్రస్థాయిలో పావులు కదుపుతోంది.

NLG: అమ్మో ఈ ఆలయాలకు వెళ్లాలంటేనే..

జిల్లాలో ఈజీ మనీ కోసం ట్రాన్స్ జెండర్లు వీరంగం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా పలు ఆలయాల వద్ద తిష్ట వేస్తున్న ట్రాన్స్జెండర్లు భక్తుల నుంచి అడ్డగోలుగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. నిడమనూరు(M) కోట మైసమ్మ, కనగల్(M) దర్వేశిపురం ఆలయాల వద్ద అమ్మవార్లకు మొక్కుబడులు చెల్లించేందుకు, కొత్త వాహనాలకు పూజలు చేసుకునేందుకు వచ్చిన భక్తుల వద్దకు గుంపులుగా చేరుకొని ట్రాన్స్జెండర్లు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు.