News March 13, 2025
ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.
Similar News
News March 25, 2025
ఏటీఎం ఛార్జీల పెరుగుదల.. ఎప్పటినుంచంటే..

ఈ ఏడాది మే 1 నుంచి ఏటీఎం ఛార్జీల బాదుడు పెరగనుంది. ఇతర బ్యాంకుల ఏటీఎంలలో మెట్రో ప్రాంతాల్లో 5సార్లు, నాన్ మెట్రో ప్రాంతాల్లో 3సార్లు ప్రతి నెలా ఉచిత లావాదేవీలు జరుపుకోవచ్చు. మే 1 నుంచి ఆ పరిధి దాటితే డబ్బు విత్‌డ్రాకు ఇప్పుడున్న రూ.17 నుంచి రూ.19కి, బాలెన్స్ చెకింగ్‌కు ఇప్పుడున్న రూ.6 నుంచి రూ.7కి ఛార్జీలు పెరగనున్నాయి.
News March 25, 2025
KU: నేటితో ముగియనున్న డిగ్రీ పరీక్ష ఫీజు గడువు

కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ 2, 4, 6వ సెమిస్టర్ల పరీక్ష ఫీజు గడువు నేటితో ముగుస్తుందని KU అధికారులు తెలిపారు. విద్యార్థులు త్వరగా ఫీజు చెల్లించాలని సూచించారు. అలాగే ప్రతి విద్యార్థి తమ అపార్ ఐడీని ఆధార్ కార్డ్ జిరాక్స్‌ను కళాశాలల్లో ఇచ్చి లింక్ చేసుకోవాలని పేర్కొన్నారు.
News March 25, 2025
వికారాబాద్: మృత్యువులోనూ వీడని స్నేహ బంధం

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన మోమిన్‌పేట్ మండలం మొరంగపల్లి వద్ద జరిగింది. స్థానికుల వివరాలు.. బంట్వారం మండలం రొంపల్లికి చెందిన బైకాని నరేశ్ (24), మంగలి సన్నీ (22) ప్రాణస్నేహితులు. అవసర నిమిత్తం మోమిన్పేట్కు వెళ్లి తిరిగి వస్తుండగా మొరంగపల్లి గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇద్దరు అక్కడక్కడే మృతి చెందారు. వారి కుటుంబాలలో విషాదఛాయలు అలుముకున్నాయి.