News March 13, 2025

ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

Similar News

News March 25, 2025

ఫూలే దంపతులకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

సామాజిక సంస్కర్త జ్యోతిబా ఫూలే, ఆయన సతీమణి సావిత్రిబాయి ఫూలేను భారతరత్నతో సత్కరించాలని డిమాండ్ చేస్తూ మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సందర్భంగా CM ఫడణవీస్ మాట్లాడుతూ ‘మహాత్మా బిరుదు దేశంలో అన్నింటికన్నా గొప్పది. దీనిని ప్రజలు ఫూలే, గాంధీకి మాత్రమే ఇచ్చారు’ అని పేర్కొన్నారు. ఫూలే దంపతులు 19వ శతాబ్దంలో బాలికల విద్యను ప్రోత్సహిస్తూ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడారు.

News March 25, 2025

NRPT: వారికి కలెక్టర్ WARNING

image

విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని కలెక్టర్ సిక్తా పట్నాయక్ హెచ్చరించారు. వారం రోజులలో పనితీరు మెరుగుపర్చుకుని, లక్ష్య సాధనకు చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆమె ఆదేశించారు. సోమవారం నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్‌లో ఉట్కూరు, కోస్గి, నారాయణపేట, మద్దూర్, దామరగిద్ద మండలాల అధికారులతో ఉపాధి హామీ, హరితహారం, స్వచ్ఛభారత్ మిషన్ కార్యక్రమాలపై సమావేశం నిర్వహించారు.

News March 25, 2025

గజ్వేల్ అంటే అభిమానం.. అభివృద్ధికి సహకరిస్తా: సీఎం

image

గజ్వేల్ నియోజకవర్గం పట్ల తనకు ప్రత్యేక అభిమానం ఉందని గజ్వేల్ అభివృద్ధికి సహకరిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి సోషల్ మీడియాలో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి పాదయాత్రగా వెళ్లి గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ శాసనసభకు రాకపోవడంతో నియోజకవర్గ సమస్యలు సభలో ప్రస్తావనకు రావట్లేదని సీఎంను కలిసి ఫిర్యాదు చేశారు. ఈవిషయం తన దగ్గరికి వచ్చిన వీడియోను సీఎం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజల సంక్షేమం ముఖ్యమన్నారు.

error: Content is protected !!