News March 13, 2025

ప్రభలతో దద్దరిల్లనున్న కొమ్మాల!

image

హోలీ రోజు జరిగే గీసుగొండ కొమ్మాల జాతరకు తరలివచ్చే ఎడ్ల బండ్లు, రాజకీయ ప్రభలకు దశాబ్దాల చరిత్ర ఉంది. వేలాది భక్తులు ప్రభ బండ్లను ఊరేగింపుగా తీసుకొస్తారు. హోలీ రోజు, నిండు పౌర్ణమి సందర్భంగా భక్తులు, రాజయకీయ నాయకులు ఎడ్లబండ్లు, ఒంటె, ఏనుగు, గుర్రం, మేక వంటి ప్రభలతో ఇక్కడికి వస్తుంటారు. పోటీ పడి మరీ ప్రభలను ఎత్తులో నిర్మిస్తుంటారు. వరంగల్ నుంచి కూడా ఇక్కడకు ఎడ్లబండ్లపై వస్తుండటం విశేషం.

Similar News

News March 19, 2025

పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో వరంగల్ కలెక్టర్ సమీక్ష

image

సీఈవో ఆదేశాల మేరకు కలెక్టర్ కార్యాలయంలో అదరపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి కలెక్టర్ సత్య శారద ఆధ్వర్యంలో పొలిటికల్ పార్టీ ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఇప్పటివరకు నియోజకవర్గాల వారీగా ఎలక్ట్రోరల్ డ్రాఫ్ట్ మొత్తం ఓటర్లు 771139 కాగా, అందులో ఆడిషన్స్ 3777, డెలిషన్స్ 2092 ఉన్నాయని ఫైనల్ ఎలక్ట్రానిక్ ఓటర్లు 772824 ఉన్నారన్నారు.

News March 19, 2025

ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలి: కలెక్టర్ 

image

రైతులు తక్కువ నీరు అధిక ఆదాయం ఇచ్చే ఆయిల్ పామ్ సాగు చేసేందుకు ముందుకు రావాలని కలెక్టర్ సత్య శారద కోరారు. కలెక్టరేట్లో రాష్ట్ర ఉద్యానవన పట్టు పరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. రైతులు వరి, మొక్కజొన్న, పంటల సాగు పైనే ఎక్కువ శ్రద్ధ చూపిస్తున్నారని ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడి చేయవలసి వస్తుందన్నారు.

News March 18, 2025

వరంగల్ మార్కెట్లో మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా

image

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నేడు పలురకాల మిర్చి ఉత్పత్తుల ధరలు ఇలా ఉన్నాయి. దీపిక మిర్చి క్వింటాకి రూ.15,800(నిన్న 16వేలు) పలకగా.. 5531 రకం మిర్చికి నిన్నటిలాగే రూ.11,000 ధర వచ్చింది. అలాగే టమాటా మిర్చికి నిన్నటిలాగే రూ.30 వేలు, సింగిల్ పట్టి మిర్చికి రూ.33వేలు (నిన్న రూ.32వేలు) ధర, ఎల్లో మిర్చికి రూ.20,500 ధర వచ్చిందని వ్యాపారులు తెలిపారు.

error: Content is protected !!