News February 2, 2025
ప్రభాకర్‌ను విచారిస్తున్న పోలీసులు (UPDATE)

గచ్చిబౌలిలోని పబ్‌లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్ నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌ను సీసీఎస్, క్రైమ్, ఎస్ఓటీ బృందాలు విచారిస్తున్నాయి. ప్రభాకర్‌పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News January 10, 2026
కేంద్రం ముందు ఏపీ మంత్రి బడ్జెట్ ప్రతిపాదనలు!

కేంద్ర బడ్జెట్లో APకి ప్రాధాన్యం ఇవ్వాలని ఢిల్లీలో కేంద్ర మంత్రి నిర్మలను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కోరారు. రాజధాని నిర్మాణం, నదుల అనుసంధానం, రాయలసీమ ప్రాంతీయ సమగ్రాభివృద్ధి, సాస్కీ, పూర్వోదయ పథకాలకు నిధులు, వైజాగ్ ఆర్థిక ప్రాంతీయాభివృద్ధికి ₹5వేల కోట్ల కేటాయింపు, పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక సాయం, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్యాకేజ్ ఇవ్వాలంటూ ప్రతిపాదనలు చేశారు.
News January 10, 2026
ప్రజావాణికి పెద్ద శంకరంపేటలో కలెక్టర్ హాజరు

మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ సోమవారం (జనవరి 12) పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకానున్నారు. జిల్లా కేంద్రంతో పాటు మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించనున్నారు. ప్రజలకు దూరభారం, ఖర్చులు తగ్గించేందుకు ఈ వినూత్న విధానం చేపట్టామని, ప్రతి వారం ఒక మండలంలో కలెక్టర్ పాల్గొంటారని తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News January 10, 2026
రికార్డు సృష్టించిన జెమీమా

WPLలో యంగెస్ట్ కెప్టెన్‌గా జెమీమా రోడ్రిగ్స్(25y 127days) రికార్డు సృష్టించారు. ఈ సీజన్లో ఆమె ఢిల్లీ క్యాపిటల్స్‌కు సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. జెమీమా తర్వాతి స్థానంలో స్మృతి మంధాన(26y 230days-2023) ఉన్నారు. కాగా ఇవాళ ముంబైతో జరుగుతున్న మ్యాచులో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.


