News February 2, 2025
ప్రభాకర్‌ను విచారిస్తున్న పోలీసులు (UPDATE)

గచ్చిబౌలిలోని పబ్‌లో పోలీసులపై బత్తుల ప్రభాకర్ కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. అయితే ప్రభాకర్ నుంచి 2 తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బిహార్ నుంచి తుపాకులను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్‌ను సీసీఎస్, క్రైమ్, ఎస్ఓటీ బృందాలు విచారిస్తున్నాయి. ప్రభాకర్‌పై ఎక్కడెక్కడ కేసులు ఉన్నాయన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
Similar News
News February 16, 2025
పెద్దగట్టు జాతరలో అర్ధరాత్రి కీలక ఘట్టం

యాదవుల కులదైవమైన ప్రసిద్ధిగాంచిన పెద్దగట్టు లింగమంతులస్వామి జాతర ఆదివారం ప్రారంభమైంది. మేడారం తర్వాత రాష్ట్రంలో అతిపెద్ద జాతరగా పేరుగాంచిన గొల్లగట్టు జాతర సమ్మక్క-సారలమ్మ జాతరలాగే 2ఏళ్లకోసారి జరుగుతుంది. ఈ జాతరలో కీలక ఘట్టమైన దేవరపెట్టె(అందనపు చౌడమ్మ పెట్టె) తరలింపు కార్యక్రమాన్ని ఈరోజు అర్ధరాత్రి నిర్వహించనున్నారు. కాగా శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ జాతర గురించి అనేక కథనాలు ప్రాచుర్యంలో ఉన్నాయి.
News February 16, 2025
లక్షెట్టిపేటలో భార్యను హత్య చేసిన భర్త

భార్యను భర్త దారుణంగా హత్య చేసిన ఘటన లక్షెట్టిపేటలో జరిగింది. SI సతీశ్ వివరాల ప్రకారం.. గోదావరి రోడ్డుకు చెందిన గణేశ్ తన భార్య రాజ కుమారిని సిమెంటు ఇటుక, బండరాయితో కొట్టి చంపాడు. కాగా కొద్ది రోజులుగా గణేశ్ మద్యం తాగి వచ్చి భార్యకు ఇతరులతో వివాహేతర సంబంధం ఉందని గొడవ పడేవాడన్నారు. ఆమె ఆదివారం తెల్లవారుజామున బాత్రూమ్‌కు వెళ్ళగా గణేశ్ వెనకాలే వెళ్లి తలపై కొట్టి చంపాడని ఎస్ఐ వెల్లడించారు.
News February 16, 2025
HYD: నుమాయిష్‌కు రేపే లాస్ట్

HYDలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరుగుతున్న నుమాయిష్‌కు సందర్శకులు పోటెత్తుతున్నారు. రేపు చివరి రోజు కావడంతో నుమాయిష్‌ను సందర్శించేందుకు భారీగా తరలివస్తున్నారు. శనివారం రికార్డు స్థాయిలో 90 వేల మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు సొసైటీ బుకింగ్ కమిటీ కన్వీనర్ సత్యేందర్, ఎగ్జిబిషన్ సొసైటీ కార్యదర్శి సురేందర్ రెడ్డి తెలిపారు. జనవరి 3వ తేదీన ప్రారంభమైన నుమాయిష్ రేపటితో ముగియనున్న విషయం తెలిసిందే.