News November 10, 2024

ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుక: కలెక్టర్ నాగారాణి

image

ఇసుక వినియోగదారులు ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఉచిత ఇసుకను పొందాలని ప.గో.జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం తెలిపారు. జిల్లాలో ఇసుక అందుబాటులో లేనందున తూ.గో.జిల్లా తిపర్రు- 2&3, ఔరంగాబాద్ రీచ్‌ల ద్వారా ఇసుకను పొందేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. తిపర్రులో రూ.96.02, ఔరంగాబాద్‌లో రూ.229 చెల్లించాల్సి ఉందని, దీనికి రవాణా ఛార్జీలు అదనం అన్నారు.

Similar News

News November 14, 2024

పేరుపాలెం బీచ్‌ను సందర్శించిన ట్రైనీ ఐఏఎస్‌లు

image

లాల్ బహదూర్ శాస్త్రి ఐఏఎస్ ముస్సూరీకి చెందిన పదిమంది ట్రైనీ ఐఏఎస్‌లు గురువారం మొగల్తూరు మండలం బీచ్‌ను సందర్శించారు. వీరికి మొగల్తూరు మండల తహశీల్దార్ కిషోర్, ఎంపీడీవో, ఎంపీడీవో త్రిశూలపానీలు బీచ్ గురించి వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేరుపాలెం సముద్ర తీర ప్రాంతం పర్యాటకంగా ఎంతో రమ్యంగా ఉందని ఈ ప్రాంతాన్ని సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.

News November 14, 2024

ఉమ్మడి ప.గో జిల్లాలో నేడు పెట్రోల్ , డీజిల్ ధరలు ఇలా

image

ఉమ్మడి ప.గో జిల్లాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి. గురువారం ఏలూరులో లీటరు పెట్రోల్ ధర రూ.109.97 ఉండగా డీజిల్ ధర రూ.97.76 ఉంది. అలాగే ప.గో జిల్లాలో డీజిల్ రూ.97.24 ఉండగా.. పెట్రోల్ ధర రూ.109.40 ఉంది.

News November 14, 2024

పెనుగొండ : కొండెక్కుతున్న ఉల్లి

image

ఉల్లిధర వినియోగదారులను కంటతడి పెట్టిస్తోంది. నెల నుంచి వారవారానికి ధర ఎగబడుతోంది. పెనుగొండ మార్కెట్‌లో ఉల్లి ధరలకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. పైగా కార్తీక మాసం కావడంతో ఈ వారం రోజుల్లోనే రూ. 70-80 కి చేరిందని వ్యాపారస్థులు చెబుతున్నారు. ఉల్లి దిగుమతి తగ్గడంతో ధరలు ఊపందుకున్నాయని అంటున్నారు.