News April 16, 2025
ప్రభుత్వాన్ని కూలుస్తామన్న వ్యాఖ్యలపై స్పందించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూలుస్తామంటూ తాను ఎక్కడా చెప్పలేదని MLA కొత్త ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏడాదిన్నరగా అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని, దాని ఫలితమే ప్రభుత్వంపై ఈ అసంతృప్తి అని ఆయన వివరించారు. రేవంత్ ప్రభుత్వం ఐదేళ్లు ఉండాలని, కాంగ్రెస్‌పై వచ్చే వ్యతిరేకత మరో పదిహేను, ఇరవై ఏళ్ల వరకు BRS అధికారంలో ఉండడానికి ఎటువంటి ఢోకా ఉండదని KCR చెప్పిన మాటలను తాను వెల్లడించానన్నారు.
Similar News
News December 3, 2025
WNP: ఒకే వార్డుకు తండ్రికొడుకులు పోటీ

ఖిల్లాగణపురం మండలం మామిడిమాడ గ్రామపంచాయతీ నాలుగో వార్డుకు తండ్రి కొడుకులు పోటీపడుతున్నారు. కొడుకు ఏ సాయికుమార్ టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉండగా, తండ్రి తిరుపతయ్య కాంగ్రెస్ నుంచి బరిలో ఉన్నారు. తండ్రి కొడుకుల్లో ఎవరు గెలుస్తారనే ఆసక్తి ఓటర్లలో నెలకొంది.
News December 3, 2025
వెనిజులాపై అతి త్వరలో దాడి చేస్తాం: ట్రంప్

మొన్నటి వరకూ నోబెల్ శాంతి బహుమతి కోసం ప్రయత్నించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూటు మార్చారు. వెనిజులాపై త్వరలో దాడులు చేస్తామని హెచ్చరించారు. మాదకద్రవ్యాలు అమెరికాలోకి రవాణా చేస్తున్న ఏ దేశానికైనా సైనిక చర్య తప్పదన్నారు. ఇప్పటివరకు డ్రగ్స్ బోట్లపై US జరిపిన దాడుల్లో 80 మందికి పైగా చనిపోయారు. వెనిజులాపై దాడికి దిగితే తీవ్ర పరిణామాలకు దారితీయవచ్చని అంతర్జాతీయవర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
News December 3, 2025
MDK: సర్పంచ్, వార్డు అభ్యర్థుల గుర్తులు ఎలా కేటాయిస్తారో తెలుసా..?

గ్రామ పంచాయతీ ఎన్నికల తొలి విడతలో నామినేషన్లు వేసిన అభ్యర్థులు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణ చేసుకోవచ్చు. గడువు ముగిసిన వెంటనే పోటీలో ఉన్న వారికి గుర్తుల కేటాయింపు ప్రారంభమవుతుంది. అయితే ఈసారి గుర్తుల కేటాయింపు తెలుగు అక్షర క్రమానుసారం జరుగుతుంది. నామినేషన్ పత్రంలో అభ్యర్థి పేరు ఎలా నమోదు అయిందో, ఆ పేరులోని మొదటి అక్షరం ఆధారంగానే గుర్తులను కేటాయిస్తారు.


