News August 21, 2024
ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకున్న జడ్జి
నిడమనూరు మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న టి.స్వప్న ప్రసవం కోసం భద్రాద్రి జిల్లా కొత్తగూడెంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ అయి ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వైద్య సిబ్బంది పనితీరు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రి అంటే పునర్జన్మ ఇచ్చే దేవాలయం అని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలపై కలెక్టర్‌కి నివేదిక ఇస్తానన్నారు.
Similar News
News September 13, 2024
ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురణ: జిల్లా కలెక్టర్
ఇవాళ ఫొటో ఓటరు జాబితాను ఆయా గ్రామపంచాయతీలు, మండల పరిషత్ కార్యాలయాలలో ప్రచురించనున్నట్లు నల్గొండ కలెక్టర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. ముసాయిదా ఫొటో ఓటరు జాబితాపై ఈనెల 18న జిల్లా స్థాయిలో ఎన్నికల అథారిటీ, 19న మండల స్థాయిలో MPDOలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
News September 13, 2024
ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి : కలెక్టర్
ఈనెల 17న ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రజాపాలన దినోత్సవ ఏర్పాట్లపై గురువారం అయన జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కేంద్రం మొదలుకొని గ్రామపంచాయతీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, గ్రామపంచాయతీలలో జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని కలెక్టర్ తెలిపారు.
News September 12, 2024
‘ఆ లక్ష్యం సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలి’
కష్టమ్ మిల్లింగ్ రైస్ లక్ష్యాన్ని సాధించేందుకు సెలవు దినాలలో సైతం పనిచేయాలని అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ మిల్లర్లు, పౌర సరఫరాల శాఖ అధికారులను కోరారు. గురువారం ఆయన తన చాంబర్లో 2023- 24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై రైస్ మిల్లర్లు, పౌరసరఫరాలు, ఎఫ్సిఐ అధికారులతో సమీక్షించారు. 2023 -24 ఖరీఫ్, రబీకి సంబంధించిన సీఎంఆర్‌ను చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెలాఖరు వరకు గడువు విధించిందని తెలిపారు.