News February 5, 2025
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలను పెంచాలి: SRPT కలెక్టర్

అధికారులు విధుల్లో పారదర్శకంగా పనిచేసి గుర్తింపు పొందాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం ఆత్మకూరు(ఎస్) మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అధిక ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, వైద్యులు పాల్గొన్నారు.
Similar News
News February 18, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి మరో స్టార్ బౌలర్ దూరం

ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు న్యూజిలాండ్ జట్టుకు కీలక బౌలర్ దూరమయ్యారు. కుడి పాదానికి గాయం కారణంగా లోకి ఫెర్గూసన్ టోర్నీ మొత్తానికి దూరమైనట్లు న్యూజిలాండ్ ప్రకటించింది. అతడి స్థానంలో జెమిసన్‌ను తీసుకున్నట్లు వెల్లడించింది. ఇప్పటికే ఆస్ట్రేలియా, భారత్‌కు స్టార్ బౌలర్లు దూరమైన సంగతి తెలిసిందే. కీలక బౌలర్లు దూరమవడంతో బ్యాటర్లకు ఈ టోర్నీ పండగే కానుందని క్రికెట్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
News February 18, 2025
తారకరత్న వర్ధంతి వేళ భార్య ఎమోషనల్ పోస్ట్

నందమూరి తారకరత్న వర్ధంతి వేళ ఆయన సతీమణి అలేఖ్య భావోద్వేగానికి గురయ్యారు. ‘విధి వక్రించి మిమ్మల్ని మా నుంచి దూరం చేసింది, నువ్వులేని లోటు లోకంలో ఏది పూరించలేదు. మీ జ్ఞాపకాలు మా చుట్టూనే తిరుగుతున్నాయి’ అని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. తారకరత్న ఫొటో ముందు పిల్లలతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. రెండేళ్ల క్రితం యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవంలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో మరణించారు.
News February 18, 2025
కేసు వాదిస్తుండగా గుండెపోటుతో లాయర్ మృతి

తెలంగాణ హైకోర్టులో గుండెపోటుతో న్యాయవాది పసునూరు వేణుగోపాల రావు మరణించారు. ఓ కేసులో వాదనలు వినిపిస్తూ కోర్టు హాల్లోనే ఒక్కసారిగా కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయారని వైద్యులు వెల్లడించారు. లాయర్ మృతితో మిగతా కోర్టు హాళ్లలో రెగ్యులర్ పిటిషన్లను వాయిదా వేశారు.