News June 12, 2024

ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించాలి: సుమిత్

image

ప.గో జిల్లా భీమవరం కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కలెక్టర్ సుమిత్ కుమార్ జిల్లాలోని పీహెచ్సీల వైద్య అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రిలో నూరు శాతం డెలివరీలు జరగాలని, తక్కువగా డెలివరీలు జరుగుతున్న ఆస్పత్రులను సమీక్షించుకొని తగిన చర్యలు తీసుకోవాలని డీఎం అండ్ హెచ్‌ఓకు సూచించారు. పేషెంట్ల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకోవాలని అన్నారు. 

Similar News

News October 18, 2025

పేదలకు ఉచిత న్యాయ సలహా: జడ్జి కే. మాధవి

image

పేదలకు ఉచిత న్యాయ సలహా, సహాయాన్ని అందిస్తామని తాడేపల్లిగూడెం సీనియర్ సివిల్ జడ్జి కే. మాధవి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి సూర్యకిరణ్ శ్రీ తెలిపారు. శనివారం పెంటపాడు, గణపవరం పంచాయతీ కార్యాలయాల వద్ద వారు న్యాయ సహాయ సేవా కేంద్రాలను ప్రారంభించారు. న్యాయపరమైన సమస్యలకు ఉచితంగా పరిష్కారం అందిస్తామన్నారు. చిన్న సమస్యలను ‘లీగల్ ఎయిడ్ క్లినిక్’ ద్వారా పరిష్కరించుకోవచ్చని సూచించారు.

News October 18, 2025

వివాహిత అదృశ్యం కేసు పై హైకోర్టు సీరియస్

image

తాడేపల్లిగూడెం (M) దండగర్రకు చెందిన వివాహిత మహిళ మంగాదేవి అదృశ్యం కేసు విచారణలో హైకోర్టు సీరియస్ అయింది. మహిళ తండ్రి బండారు ప్రకాశరావు 2017లో కోర్టును ఆశ్రయించడంతో ఆ కేసు శుక్రవారం విచారణకు వచ్చింది. వివాహిత భర్త బ్రహ్మాజీని ఐదేళ్ల తర్వాత విచారించడం పై హైకోర్టు న్యాయమూర్తి దేవానంద్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేసు పురోగతి తెలియజేయాలంటూ పోలీసులకు ఆదేశిస్తూ నాలుగు వారాలకు వాయిదా వేసింది.

News October 17, 2025

ధాన్యం కొనుగోళ్లకు ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

image

ఖరీఫ్ సీజన్‌లో ధాన్యం కొనుగోలు ఏర్పాట్లపై భీమవరం కలెక్టరేట్‌లో జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి సమీక్షించారు. ధాన్యం సేకరణ త్వరలో ప్రారంభం కానున్నందున, సంబంధిత అధికారులు ఏర్పాట్లు సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలలో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని ఆర్డీవోలకు సూచించారు.