News February 12, 2025
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలి: Dy DMHO
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739367697134_60389387-normal-WIFI.webp)
ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా చూడాలని డిప్యూటీ DMHO డాక్టర్ విజయకుమార్ తెలిపారు. దామెర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని Dy DMHO సందర్శించి, ఫార్మసీ స్టోర్, ల్యాబ్, ఆయుష్ క్లినిక్లను పరిశీలించారు. గర్భిణుల నమోదు, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలపై సమీక్షించారు. ఇందులో అశోక్ రెడ్డి, మాధవరెడ్డి, డాక్టర్ మహేంద్ర, రవీందర్, పి.శ్రీకాంత్, రాజేశ్వరి, పాల్గొన్నారు.
Similar News
News February 13, 2025
కాసేపట్లో మోదీ, ట్రంప్ కీలక భేటీ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739412239144_367-normal-WIFI.webp)
అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ కాసేపట్లో అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కానున్నారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. వలస విధానం, ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ల తరలింపు, ట్రేడ్, టారిఫ్స్, విదేశాంగ విధానాలపై చర్చలు జరపనున్నారు. ఇప్పటికే భారత్ ఖరీదైన బైకులపై టారిఫ్స్ తగ్గించింది. ఈ పర్యటన తర్వాత మరిన్ని దిగుమతులపై టారిఫ్ తగ్గించే అవకాశం ఉంది.
News February 13, 2025
MBNR: ‘స్థానిక ఎన్నికల్లో ఆర్వోలది పాత్ర కీలకం’
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739412400802_11055407-normal-WIFI.webp)
పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జడ్పీ డిప్యూటీ సీఈవో ముసాయిదాబేగం అన్నారు. నిన్న జడ్పీ ఆఫీసులో ROలు, AROలకు శిక్షణ నిర్వహించారు. స్థానిక ఎన్నికల నిర్వహణలో ఆర్వోలది క్రియాశీలక పాత్ర అన్నారు.ఎన్నికల నిబంధనల మేరకు పనిచేయాల్సి ఉంటుందని, ప్రతి అంశాన్ని క్షుణంగా పరిశీలించాలన్నారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలన్నారు.
News February 13, 2025
పాలకుర్తి: తండ్రికి తల కొరివి పెట్టిన ఐదేళ్ల చిన్నారి
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739377263876_50410254-normal-WIFI.webp)
జనగామ జిల్లా పాలకుర్తి మండలం లక్ష్మీనారాయణపురం గ్రామానికి చెందిన నాగన్న(30) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. అభం శుభం తెలియని తన కూతురు రితీక(5) ‘నాన్న లే నాన్నా’ అంటూ బుధవారం కుటుంబ సభ్యుల సమక్షంలో నాగన్న చితికి నిప్పు పెట్టి అంత్యక్రియలు నిర్వహించింది. ఈ ఘటన చూసిన గ్రామస్థులు కన్నీరు మున్నీరయ్యారు.