News August 28, 2024
ప్రభుత్వ ఉద్యోగి మృతి.. 4 రోజుల తర్వాత గుర్తింపు
NLG వైద్యఆరోగ్యశాఖ పరిధిలో పనిచేస్తున్న హెల్త్ అసిస్టెంట్ పురుషోత్తం రాజు(48) అనారోగ్యంతో 4 రోజుల క్రితం మృతి చెందారు. ఇటీవల పురుషోత్తమ రాజు సడెన్‌గా విధులకు హాజరు కాకపోవడం, అందుబాటులో లేకపోవడంతో మంగళవారం తోటి ఉద్యోగులు పానగల్ అలివేలుమంగాపురం కాలనీలో ఉన్న అతడి ఇంటికి వెళ్లి చూసి పోలీసులు సమాచారం ఇచ్చారు. తలుపులు పగలగొట్టి చూడడంతో అతడి మృతదేహం కుళ్ళిపోయి కనిపించింది.
Similar News
News September 19, 2024
దేవరకొండ: ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యం
నల్గొండ జిల్లా దేవరకొండ మైనార్టీ గురుకుల పాఠశాలలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థుల ఆచూకీ లభ్యమైనట్లు సీఐ నరసింహులు తెలిపారు. పాఠశాల గోడ దూకి పారిపోయిన విద్యార్థులు బుధవారం అర్ధరాత్రి చింతపల్లి మండలం మాల్ పట్టణంలో పోలీసులకు దొరికినట్టు తెలిపారు. విద్యార్థులను దేవరకొండ పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చినట్లు పేర్కొన్నారు.
News September 19, 2024
నల్గొండ: వృద్ధురాలిపై అత్యాచారం.. కేసు నమోదు
నల్గొండకి చెందిన 60 సంవత్సరాల వృద్ధురాలిని హిందూపూర్ స్మశాన వాటిక వద్ద కందుల కృష్ణ అనే యువకుడు బుధవారం తెల్లవారుజామున అత్యాచారం చేశాడని వన్ టౌన్ సీఐ ఏమి రెడ్డి రాజశేఖర్ తెలిపారు. విషయం ఎవరికైనా చెప్తే చంపుతానని బెదిరించి వెళ్లిపోయాడని తెలిపారు. బాధితురాలు కూతురితో విషయం చెప్పి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
News September 19, 2024
3 రోజుల్లో సాగర్ ఆయకట్టుకు సాగునీటి విడుదల
నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి ఎస్ఎల్బీసీ హై లెవెల్ కెనాల్‌కు సంబంధించిన నాలుగో పంపు మరమ్మతులు పూర్తయ్యాయని, 3 రోజుల్లో ఈ పంపు ద్వారా ఆయకట్టుకు సాగునీటిని విడుదల చేస్తామని ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వి.అజయ్ కుమార్ తెలిపారు. దీంతో ప్రాజెక్టు కాలువల్లో నీరు సమృద్ధిగా పారుతుందని రైతులెవరూ అధైర్య పడాల్సిన అవసరం లేదని ఆయన వెల్లడించారు.