News February 12, 2026
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ

TG: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కొత్త హెల్త్ పాలసీ అమల్లోకి రానుంది. దీంతో ఎంప్యానెల్డ్ హాస్పిటల్స్‌లో పరిమితి లేని వైద్య సదుపాయాలు ఉంటాయి. ఉద్యోగులు, పెన్షనర్ల బేసిక్ పేలో 1.5%, సర్కార్ 1.5% కలిపి మొత్తం 3%(ఏటా సుమారు రూ.1000Cr) కేటాయించనుంది. పథకం ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ రంగ సంస్థలు, మోడల్ స్కూల్స్, గురుకులాల సిబ్బందినీ ఇందులోకి తీసుకొచ్చే అవకాశముంది. దీనికోసం కమిటీని ఏర్పాటు చేయనుంది.
Similar News
News March 9, 2026
చమురు భగభగ.. 120 డాలర్లకు చేరిన బ్యారెల్!

మిడిల్ ఈస్ట్‌లో టెన్షన్స్‌తో క్రూడ్ ఆయిల్ ధర ఒక్క రోజులో 29% పెరిగింది. రష్యా-ఉక్రెయిన్ వార్ నేపథ్యంలో 2022లో చివరగా ఈ రేంజ్ హైక్ నమోదైంది. UAE ముర్బాన్ క్రూడ్ బ్యారెల్ (159L) ధర $120కు, వెస్ట్ టెక్సాస్ $115, బ్రెంట్ క్రూడ్ $116కు చేరాయి. ఇరాక్, కువైట్, UAEలో చమురు ఉత్పత్తి తగ్గడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ఇరాక్‌లో రోజుకు 4.3M బ్యారెల్స్‌గా ఉండే ఉత్పత్తి 1.8 మిలియన్లకు పడిపోయింది.
News March 9, 2026
ఆ ముగ్గురికీ T20WC ట్రోఫీ అంకితం: గంభీర్

టీమ్ ఇండియా హెడ్ కోచ్ గంభీర్ T20WC విజయాన్ని ద్రవిడ్, లక్ష్మణ్, అగార్కర్‌లకు అంకితం ఇచ్చారు. టీమ్ గెలుపు బాటలో నడవడానికి అవసరమైన వ్యవస్థను వారు నిర్మించారని కొనియాడారు. ‘ద్రవిడ్ కోచ్‌గా ఉన్నప్పుడు జట్టు స్థిరత్వాన్ని కాపాడారు. BCCI సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ హెడ్ లక్ష్మణ్ జాతీయ స్థాయిలో ప్రతిభను వెలికితీస్తున్నారు. చీఫ్ సెలెక్టర్ అగార్కర్ నిబద్ధత, నిజాయతీతో పనిచేస్తున్నారు’ అని పేర్కొన్నారు.
News March 9, 2026
BREAKING: శుభవార్త చెప్పిన ప్రభుత్వం

దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. క్రూడాయిల్ ధరలు పెరిగినప్పటికీ పెట్రోల్, డీజిల్ ఇంధన ధరలను పెంచబోమని ప్రకటించింది. నష్టాలను ఆయిల్ కంపెనీలే భరించాలని స్పష్టం చేసింది. ఇప్పటికే గ్యాస్ ధరల <<19316911>>పెరుగుదలతో<<>> ఇబ్బందులు పడుతున్న సామాన్యులకు కేంద్ర నిర్ణయంతో కాస్త ఊరట లభించనుంది.


