News November 16, 2024

‘ప్రభుత్వ కార్యాలయాల తరలింపును విరమించుకోవాలి’

image

కర్నూలులోని లోకాయుక్త, హెచ్ఆర్‌సీ, ఏపీ ఈఆర్‌ఏ, వక్ఫ్ ట్రిబ్యునల్ కార్యాలయాలను అమరావతికి తరలించాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి, ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం వారు కర్నూలు కలెక్టరేట్లో కలెక్టర్ రంజిత్ బాషాకు వినతిపత్రం అందజేశారు. కర్నూలులోని ప్రభుత్వ కార్యాలయాలను అమరావతికి తీసుకెళ్లడం అన్యాయం అని తెలిపారు.

Similar News

News November 26, 2025

‘ఆదోని’కి మళ్లీ నిరాశే..!

image

ఆదోని ప్రాంత ప్రజలకు మరోసారి నిరాశ ఎదురైంది. YCP ప్రభుత్వ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజన సమయంలో ఆదోనిని జిల్లా చేయాలని ఆ ప్రాంతవాసులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. వారి విజ్ఞప్తిని సర్కార్ పట్టించుకోలేదు. ప్రస్తుత ప్రభుత్వం మార్పులు చేర్పులు చేపట్టడంతో మళ్లీ నిరసన గళంవిప్పారు. ఈ ప్రభుత్వం కూడా మొండిచేయి చూపింది. జిల్లా ఏర్పాటు ఆవశ్యకతను కూటమి నాయకులు CM చంద్రబాబుకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

News November 26, 2025

కర్నూలు జిల్లా నుంచి అధ్యక్షా.. అనేది వీరే..!

image

సంవిధాన్ దివస్-రాజ్యాంగ దినోత్సవ వేడుకల్లో భాగంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విద్యార్థులకు అసెంబ్లీలో మాట్లాడే అవకాశాన్ని (మాక్ అసెంబ్లీ) కల్పించారు. బుధవారం కర్నూలు జిల్లా నుంచి అసెంబ్లీలో మాట్లాడేందుకు జిల్లా ఎమ్మెల్యేలు (విద్యార్థులు) సిద్ధమయ్యారు. దయాన, లోకేశ్వర్ రెడ్డి, గాయత్రి, నవనీత్ కుమార్, వీరేంద్ర, గౌతమి, ప్రవీణ్ ప్రజా సమస్యలపై తమ గొంతు వినిపించనున్నారు.

News November 26, 2025

రెండు మండలాలుగా విభజన కానున్న ఆదోని

image

కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని మండలాన్ని విభజించి రెండు మండలాలుగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. మండలంలో మొత్తం 46 గ్రామాల పరిధిలో 2,69,286 మంది జనాభా ఉన్నారు. పెద్దహరివాణం కేంద్రంగా ఏర్పడే మండలంలో 16 గ్రామాలను చేర్చనున్నారు. 43,105 మంది జనాభా ఉంటారు. ఆదోని కేంద్రంగా ఉండే మండలంలో 30 గ్రామాలు ఉంటాయి. 2,26,181 మంది జనాభా ఉంటారు.