News September 21, 2024
ప్రభుత్వ తీరు హాస్యాస్పదంగా ఉంది: ఉషశ్రీ చరణ్
100 రోజుల పాలన విఫలం కావడంతోనే సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల లడ్డూల విషయం తెరపైకి తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని వైసీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ తెలిపారు. శనివారం పెనుకొండలో ఆమె మాట్లాడుతూ.. కూటమి మంచి ప్రభుత్వమా? కాదా అన్నది? ప్రజలు చెప్పాలన్నారు. కానీ కూటమి నేతలే తమది మంచి ప్రభుత్వం అని ప్రచారం చేసుకోవడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు.
Similar News
News October 10, 2024
SKU పరిధిలో డిగ్రీ 2వ సెమిస్టర్ ఫలితాలు విడుదల
SKU పరిధిలో డిగ్రీ రెండో సెమిస్టర్ ఫలితాలను యూనివర్సిటీ ఇన్‌ఛార్జ్ వీసీ ప్రొఫెసర్ బి.అనిత విడుదల చేశారు. మొత్తం 8,551 మంది పరీక్ష రాయగా 3,392 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో BAలో 461 మందికి గానూ 108 మంది, BBAలో 818 మందికి గానూ 353 మంది, BCAలో 174 మందికి గానూ 62 మంది, BCMలో 4,512 మందికి గానూ 1,635 మంది, BSCలో 2,586 మందికి గానూ 1,234 మంది ఉత్తీర్ణత చెందారు.
News October 10, 2024
ఈ-పంట నమోదు ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తి చేయాలి: కలెక్టర్
అనంతపురం జిల్లాలోని ఈ-పంట నమోదు ప్రక్రియ సూపర్ చెక్‌ను రెండు రోజుల్లో పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మతో కలిసి వ్యవసాయ అనుబంధ రంగ, పట్టు పరిశ్రమ, పశుసంవర్ధక, ఉద్యానవన శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News October 9, 2024
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించండి: బీజేపీ విష్ణువర్ధన్ రెడ్డి
మాజీ సీఎం జగన్ X వేదికగా చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ‘2011లో ప్రారంభమైన YCP నుంచి ఇప్పటివరకు 35 మంది MPలు, 232 మంది MLAలు గెలిచారు. ఇప్పుడు మీరు నిందిస్తున్న EVMల వల్లే గెలిచి మీరు CM అయ్యారు. మీ పాలనలో చేసిన తప్పులను దాచడానికి ప్రయత్నించడం మానేయండి. ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి, వాస్తవాలను గ్రహించి, ఆరోపణలు మానుకోండి’ అని పేర్కొన్నారు.