News February 26, 2025
ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేద్దాం: ADB కలెక్టర్

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ప్రభుత్వ పథకాలను జిల్లాలో గెజిటెడ్ అధికారుల సహకారంతో సమర్థవంతంగా అమలు చేద్దామని జిల్లా కలెక్టర్ రాజర్షిషా అన్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం ఆదిలాబాద్ జిల్లా శాఖ రూపొందించిన డైరీని కలెక్టర్ మంగళవారం ఆవిష్కరించారు. అంతకు ముందు కలెక్టర్‌ను శాలువాతో సత్కరించారు. అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు శివకుమార్, రామారావు, తదితరులు ఉన్నారు.
Similar News
News October 28, 2025
ఆదిలాబాద్‌లో బుధవారం పత్తి మార్కెట్ బంద్

అతి భారీ వర్షాలు పడే సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారి చేసినందుకు ఈనెల 29న పత్తి మార్కెట్ కు బంద్ ఉంటుందని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు. Kapas Kisan యాప్ ద్వారా స్లాట్ బుకింగ్ చేసుకున్న రైతులు స్లాట్‌ను రద్దు చేసుకోవాలన్నారు. వాతావరణ పరిస్థితులను బట్టి మరుసటి పని దినాలలో స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. రైతులు ఈ విషయాన్ని గమనించి పత్తి తేవద్దన్నారు.
News October 28, 2025
ADB: నారీమణులకు దక్కిన 10 మద్యం షాపులు

కొత్త మద్యం పాలసీ 2025–27లో 34 షాపులకు గాను ఆదిలాబాద్‌లో ప్రశాంతంగా కొనసాగింది. ఇందులో భాగంగా 10 షాపులు మహిళలకు లక్కీడ్రా ద్వారా దక్కాయి. షాప్ నం. 2, 9 విమలబాయి దక్కించుకున్నారు. తమ కుటుంబీకులకు సంబంధించిన మహిళల పేరిట షాపులు రావడంతో వారు సంబరాల్లో మునిగితేలారు. కాగా మద్యం లక్కీడ్రాకు అధిక సంఖ్యలో మహిళలు హాజరయ్యారు. వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా, అదృష్టవంతుల పేర్లు వచ్చాయి.
News October 27, 2025
తేమ 12% కంటే ఎక్కువ ఉంటే రూ. 6,950: కలెక్టర్

మార్కెట్ యార్డులో కొనుగోళ్లు నిలిచిపోవడంతో పత్తి రైతుల సమస్యల పరిష్కారం కోసం కలెక్టర్ రాజర్షి షా చొరవ తీసుకున్నారు. సోమవారం ఎమ్మెల్యే పాయల్ శంకర్, వ్యాపారస్తులతో కలిసి రెండు గంటలు సమీక్షించారు. తేమ శాతం 12% కంటే ఎక్కువ ఉన్నా, ప్రైవేటు వ్యాపారుల ద్వారా క్వింటాలుకు ₹6,950 చెల్లించేలా ఒప్పందం కుదిరిందని కలెక్టర్ తెలిపారు. దీంతో రైతులకు ఊరట లభించింది.


