News March 17, 2025
ప్రభుత్వ పథకాలపై అధికారులతో మేడ్చల్ కలెక్టర్ సమీక్ష

జిల్లాలోని శాఖల వారీగా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంత శాతం లబ్ధి చేకూరుతుందనే జాబితాలను మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం పరిశీలించారు. సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలోని వీసీ హాల్లో షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ సభ్యులు జిల్లాకు మంగళవారం రానున్న సందర్భంగా జిల్లా అధికారులతో ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలలో ఎస్సీలకు ఎంల లబ్ధి చేకూరుతుందని శాఖల వారీగా సమీక్ష నిర్వహించారు.
Similar News
News November 21, 2025
BREAKING: మహబూబాబాద్ ఎస్పీ సుధీర్ బదిలీ.. కొత్త ఎస్పీగా శబరీష్

మహబూబాబాద్ జిల్లా నూతన ఎస్పీగా శబరీష్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో శబరీష్ ములుగు జిల్లాలో ఎస్పీగా విధులు నిర్వహిస్తూ బదిలీల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లాకు వచ్చారు. ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ను ములుగు జిల్లాకు బదిలీ చేస్తూ ఉత్తర్వులను వెలువరించింది.
News November 21, 2025
వికారాబాద్ నూతన ఎస్పీగా స్నేహ మెహ్రా

రాష్ట్రంలో ఐపీఎస్ల బదిలీల పరంపర కొనసాగుతున్న నేపథ్యంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో నూతన ఎస్పీగా స్నేహ మెహ్రాను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్పీగా నారాయణరెడ్డి ఉన్న సమయంలోనే లగచర్లలో కలెక్టర్పై దాడి ఘటన జరిగింది.
News November 21, 2025
ఉద్దానం కిడ్నీ వ్యాధులపై పరిశోధన ప్రారంభం

శ్రీకాకుళం జిల్లాలోని తీరప్రాంత మండలాల్లో కిడ్నీ వ్యాధులపై సమగ్ర అధ్యయనం ప్రారంభించామని కిడ్నీ వ్యాధుల పరిశోధన ప్రాజెక్టు మెంటర్ డా.టి.రవిరాజు అన్నారు. ఉద్దానం ప్రాంతంలో 18% జనాభా కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నట్లు తమ పరిశోధనలో వెల్లడైందన్నారు. ఈ ప్రాజెక్టుకు రూ.6.01కోట్లు ఖర్చు అవుతుందని అంచానా వేశారు. ఇచ్చాపురం, కంచిలి, పలాస, కవిటి, మందస, వజ్రపు కొత్తరు ప్రాంతాల్లో పరిశోధన చేస్తున్నామన్నారు.


